Telugu Global
Andhra Pradesh

మరోసారి ఉదారత చాటుకున్న విజయ్ దేవరకొండ

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కాలు పోగొట్టుకుంది. చిన్నారికి వైద్య చికిత్సలు అందించడానికి ఆమె తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నట్లు విజయ్ దృష్టికి వచ్చింది.

మరోసారి ఉదారత చాటుకున్న విజయ్ దేవరకొండ
X

పెళ్లిచూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. రీసెంట్‌గా ఖుషి సినిమాతో హిట్ అందుకున్న విజయ్ పరశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీతో పాటు గౌతమ్ తిన్ననూరి, తరుణ్ భాస్కర్‌లతో సినిమాలను లైన్‌లో పెట్టాడు.

కాగా, సినిమాలతో అభిమానులను మెప్పించడమే కాదు. సాటివారికి సాయం చేయడంలోనూ విజయ్ ముందుంటున్నాడు. కరోనా సమయంలో విజయ్ దేవ‌ర‌కొండ‌ పలువురికి అండగా నిలిచి ఆర్థిక సాయం చేశాడు. ఇటీవల విజయ్ నటించిన ఖుషి సినిమా విడుదలైన తర్వాత తన అభిమానులైన 100 మంది కుటుంబాలకు ఒక్కో లక్ష రూపాయ‌ల‌ చొప్పున ఆర్థిక సాయం అందజేసి మంచి మనసు చాటుకున్నాడు. ఇప్పుడు మరోసారి విజయ్ తన ఉదారతను చాటుకున్నాడు.

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కాలు పోగొట్టుకుంది. చిన్నారికి వైద్య చికిత్సలు అందించడానికి ఆమె తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నట్లు విజయ్ దృష్టికి వచ్చింది. వారి వివరాలు తెలుసుకున్న విజయ్ చిన్నారి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విజయ్ మంచి మనసు పట్ల ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  31 Oct 2023 2:06 PM GMT
Next Story