Telugu Global
Andhra Pradesh

రామ్‌గోపాల్ వ‌ర్మ చెప్పిన చంద‌మామ క‌థ‌

తాజాగా స్కిల్‌ డెవలప్‌ మెంట్ స్కాం పిల్లలకు అర్థమ‌య్యేలా చెప్పాలంటే.. అని ఓ ట్వీట్ చేశారు రామ్‌గోపాల్‌ వర్మ. చంద్ర మామ కథ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఆర్జీవీ చెప్పిన చంద్రమామ కథ ఆయన మాటల్లోనే చూద్దాం..!

రామ్‌గోపాల్ వ‌ర్మ చెప్పిన చంద‌మామ క‌థ‌
X

స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై తెలుగుదేశం శ్రేణులు నానా యాగీ చేస్తున్నాయి. ఈ విషయంపై తెలుగుదేశం నేతలకే క్లారిటీ లేదని తెలుస్తోంది. కుంభకోణమే జరగలేదని ఓ సారి.. చంద్రబాబుకు సంబంధం లేదని మరోసారి ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఇక చంద్రబాబు అరెస్టయిన నాటి నుంటి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు రామ్‌గోపాల్‌ వర్మ. తనదైన శైలిలో సెటైర్లతో ఆ పార్టీ నేతలను ఇరుకున పెడుతున్నారు. తాజాగా స్కిల్‌ డెవలప్‌ మెంట్ స్కాం పిల్లలకు అర్థమ‌య్యేలా చెప్పాలంటే.. అని ఓ ట్వీట్ చేశారు రామ్‌గోపాల్‌ వర్మ. చంద్ర మామ కథ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఆర్జీవీ చెప్పిన చంద్రమామ కథ ఆయన మాటల్లోనే చూద్దాం..!

చం(ద్ర)మామ కథ

CBN స్కిల్ స్కాంని, చందమామ కథలా పిల్లలకి కూడా అర్థమయ్యేలా చెప్పాలంటే..

2014లో సీమెన్స్ సబ్సిడరీ కంపెనీ, డిజైన్ టెక్‌కి సంబంధించిన వ్యక్తి స్కిల్‌ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్‌ విషయమై CBNని కలిశాడు

రూ.3,700 కోట్ల ప్రాజెక్టులో ప్రైవేట్ సంస్థ సీమెన్స్ 90 శాతం, ప్రభుత్వం 10 శాతం పెట్టుబడి పెట్టాలని ప్రపోజల్

రూల్స్ పాటించకుండా..CBN స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, తన సన్నిహితులని సీఈవో, డైరెక్టర్‌, ఎండీలుగా నియమించి ఓ అధికారిక జీవో రిలీజ్ చేశారు. తర్వాత MOU కుదుర్చుకున్నారు. కానీ, ఇక్కడ చాలా మందికి తెలియనిది ఏంటంటే.. జీవోలో ఉన్నది వేరు.. MOUలో ఉన్నది వేరు.

ఇక మన ప్రభుత్వ వాటా 10 శాతం.. సీమెన్స్‌ వాళ్లు ఎప్పుడెంతిస్తున్నారన్న దాన్ని బట్టి, ప్రాజెక్టు ప్రొగ్రెస్‌ని బట్టి మాత్రమే రిలీజ్ చేయాలి. ఇదే విషయంపై ఫైనాన్స్ సెక్రటరీ సునీత గారు ఇంకా ఇతర సంబంధిత అధికారులు అభ్యంతరాలు చెప్పారు. అయినా వినకుండా CBN మొత్తం డబ్బు రిలీజ్ చేయాలని ఆదేశాలిచ్చేశారు. దాంతో రూ.371 కోట్లు ప్రైవేట్ సంస్థ అయినా డిజైన్‌ టెక్‌కు రిలీజ్ చేసేశారు.

ఎలాంటి టెండర్లు లేకుండా పూర్తి నామినేషన్ పద్ధతిలో ఇచ్చేశారు. ఇదే విషయాన్ని అధికారులు నోట్‌ ఫైల్స్‌లో రికార్డు చేశారు.

డిజైన్ టెక్‌ తన దగ్గరికి చేరిన డబ్బుని అసలు స్కిల్‌ డెవలప్‌మెంట్‌కి ఏ మాత్రం సంబంధం లేని వేరే వేరే కంపెనీలకు పంపించేసింది.

ఆ కంపెనీలన్ని ఫేక్‌ ఇన్వాయిస్‌లు రైస్‌ చేసి డబ్బును రీ రూట్‌ చేసే షెల్‌ కంపెనీలు

ఆ కంపెనీలను ఇన్వెస్టిగేట్ చేస్తున్న GST డిపార్ట్‌మెంట్‌ ఈ విషయాన్ని పసిగట్టి 2018లో అప్పటికీ సీఎంగానే ఉన్న CBN ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది.

ఈ ఇన్ఫర్మేషన్‌ తెలిసి కూడా CBN ఏ మాత్రం యాక్షన్ తీసుకోలేదు. పైగా ఇష్యూకి సంబంధించిన నోట్‌ ఫైల్స్‌ హార్డ్ కాపీలను వెంటనే మాయం చేసేశారు.

కానీ, షాడో ఫైల్స్ అనబడే వాటి కాపీలను ఫైనాన్స్‌ మినిస్ట్రీలో డిలీట్ చేయడం మర్చిపోయారు. ఆ ఫైల్స్ అధికారులకు చిక్కాయి.

యాక్షన్‌ తీసుకోకపోవడానికి కారణం.. మాయమైన మొత్తం డబ్బు..షెల్ కంపెనీల ద్వారా.. హవాల మార్గాల ద్వారా మళ్లీ CBN దగ్గరికే వచ్చుండవచ్చు కాబట్టి. ఈ స్కాం అంతా CBNకి తెలిసే జరిగిందన్న అనుమానం CIDకి కలిగి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది

2018లో ఇన్ఫర్మేషన్‌ వచ్చిన వెంటనే తప్పు జరిగిందని ఒప్పుకుని CBN ఎంక్వైరీ ఆర్డర్ చేసుంటే.. అధికారుల్ని ఇరికించి తను తప్పుకోవడానికి ఛాన్స్ ఉండేది.

కానీ తాను ఏం చేసినా అడిగేవాడు లేడు, ఒకవేళ అడిగినా తనకున్న మీడియా ఇన్‌ఫ్లూయెన్స్‌, జ్యూడిషరి ఇన్‌ఫ్లూయెన్స్‌తో మెనేజ్‌ చేయవచ్చు అన్న ఆరోగన్స్‌తో పట్టించుకోలేదా.. లేకా ఇంకా ఎన్నో స్కాంలు ఎప్పటి నుంచో చెప్తున్నా.. వాటి మధ్యలో దీని మీద ఫోకస్ పెట్టలేదో..!

ఈ లోగా సీమెన్స్ కంపెనీ మాకు స్కిల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో ఏం సంబంధం లేదని తేల్చి చెప్పేసింది

కథ కానీ కథలా.. ఇన్వెస్టిగేషన్‌ ఇలా సాగుతుండగా అదే క్రమంలో ఈడీ, ఐటీ డిపార్ట్‌మెంట్ల నుంచి వచ్చిన ఇన్‌పుట్‌తో స్టేట్ CID ఇన్వెస్టిగేషన్‌ చేస్తూ చేస్తూ మొన్న మొన్న CBNని అరెస్టు చేసింది.

CID చూపించిన ప్రాథమిక ఆధారాలను బట్టి జడ్జి గారు..CBNను జైలులో వేశారు

ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేకపోవచ్చు కానీ..CID పట్టేసింది.

చట్టం ముందు అందరూ సమానమేనని జ్యుడిషియరీ నిరూపించింది..

ఈ కథ సమాప్తం కాదు...

మిగితా కథ వచ్చే వారాల్లో....అంటూ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాం గురించి పూస గుచ్చినట్లు చెప్పేశారు ఆర్జీవీ.



First Published:  17 Sep 2023 7:14 AM GMT
Next Story