Telugu Global
Andhra Pradesh

లూథ్రా నువ్వేం లాయర్‌.. ఆర్జీవీ సంచలన ట్వీట్‌

సిద్ధార్థ్‌ లూథ్రా ట్వీట్‌.. తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొట్టేలా ఉందన్నారు ఆర్జీవీ. దర్యాప్తు సంస్థలతో పాటు న్యాయ వ్యవస్థపై దాడి చేయాలని ప్రోత్సహించేలా ట్వీట్ ఉందన్నారు ఆర్జీవీ

లూథ్రా నువ్వేం లాయర్‌.. ఆర్జీవీ సంచలన ట్వీట్‌
X

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్టయి మూడు రోజులు గడిచిపోయింది. ఇప్పటివరకూ కోర్టు నుంచి చంద్రబాబుకు సానుకూలంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తరఫు లాయర్‌ సిద్ధార్థ్‌ లూథ్రా చేసిన ఓ ట్వీట్‌ వైరల్‌గా మారింది. అన్ని ప్రయత్నాలు చేసినా న్యాయం కనుచూపుమేరలో కనిపించకపోతే కత్తి పట్టడమే సరైంది. పోరాటమే శరణ్యం అనేది లూథ్రా ట్వీట్ సారాంశం. అయితే ఈ ట్వీట్‌పై దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మండిపడ్డారు.


సిద్ధార్థ్‌ లూథ్రా ట్వీట్‌.. తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొట్టేలా ఉందన్నారు ఆర్జీవీ. దర్యాప్తు సంస్థలతో పాటు న్యాయ వ్యవస్థపై దాడి చేయాలని ప్రోత్సహించేలా ట్వీట్ ఉందన్నారు ఆర్జీవీ. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్న లూథ్రా.. న్యాయ వ్యవస్థపైకి దాడులను ప్రేరేపించడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. న్యాయమూర్తులు లూథ్రా ట్వీట్‌పై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానంటూ ఆర్జీవీ ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఇక మరో ట్వీట్‌లో చంద్రబాబుపై సెటైర్లు వేశారు ఆర్జీవీ. సైకిల్‌ ట్యూబ్‌లో గాలిపోయిన ఫొటోతో పాటు.. చంద్రబాబు, ఆ పక్కనే బ్రహ్మనందం జైలులో ఉన్న ఫొటోలను ట్వీట్‌ చేశారు. ఇక చంద్రబాబు అరెస్టయినప్పటి నుంచి టీడీపీకి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు ఆర్జీవీ.

First Published:  14 Sep 2023 6:30 AM GMT
Next Story