Telugu Global
Andhra Pradesh

భోగాపురంలో అప్పుడు చంద్రబాబు మోసం చేశారా..?

అప్పట్లో 2019, ఫిబ్రవరి 14వ తేదీన అంటే ఎన్నికలకు రెండునెలల ముందు చంద్రబాబు భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు. పర్యావరణ అనుమతులు లేవు.

భోగాపురంలో అప్పుడు చంద్రబాబు మోసం చేశారా..?
X

తెలుగుదేశంపార్టీలో పెద్దాయనగా, కాస్త నిజాయితీ ఉన్న వ్యక్తిగా అశోక్ గజపతిరాజుకు మంచి పేరుంది. అలాంటి రాజుగారు కూడా అబద్ధాలు చెప్పేస్తున్నారు. సావాస దోషమో ఏమో భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపనపై పచ్చి అబద్ధాలు చెప్పేశారు. తమ హయాంలోనే జరిగిన ఎయిర్‌పోర్టు శంకుస్థాపనకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయటం ఏమిటని మండిపోయారు. రాజుగారు చెప్పింది కొంతవరకే కరెక్టు. మిగిలిందంతా అబద్ధమే. ఎందుకంటే చంద్రబాబునాయుడు చేసింది ఎన్నికల శంకుస్థాపన మాత్రమే.

ఎన్నికల సమయంలో జనాల కళ్ళకు గంతలుకట్టేందుకు ప్రభుత్వాలు కొన్నిసార్లు ఇలాంటి శంకుస్థాపనలు చేస్తుంటాయి. శంకుస్థాపన జరిగిందంటే నిర్మాణం కూడా మొదలైపోతుందనే జనాలు అనుకుంటారు. కానీ నిర్మాణాలు ఎప్పటికీ మొదలుకావు. కాకపోతే శంకుస్థాపనలను చూపించి పాలకులు జనాలను మాయచేయటానికి ప్రయత్నిస్తారు. భోగాపురం విమానాశ్రయానికి చంద్రబాబు, రాజుగారు చేసింది కూడా అలాంటి మాయనే. కాకపోతే జనాలు వాళ్ళ మాయలో పడలేదు. అప్పట్లో రాజుగారే విమానయాన శాఖకు మంత్రి.

అప్పట్లో 2019, ఫిబ్రవరి 14వ తేదీన అంటే ఎన్నికలకు రెండునెలల ముందు చంద్రబాబు భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు. పర్యావరణ అనుమతులు లేవు. విమానయాన శాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీచేయలేదు. భూసేకరణ జరగలేదు. అప్పటికే రైతులు కోర్టులో కేసులు వేశారు. ఇన్ని అడ్డంకులున్నా చంద్రబాబు మాత్రం ఎంతో ఆర్భాటంతో శంకుస్థాపన చేసేశారు. అంటే అచ్చంగా ఎన్నికల శంకుస్థాపన చేసేసి జనాలను మోసంచేశారు. శంకుస్థాపనైతే చేశారు కానీ తర్వాత ఒక్క ఇటుక కూడా పడలేదు. విచిత్రం ఏమిటంటే విమానాశ్రయం నిర్మాణాన్ని చూపించి హడ్కోలో చంద్రబాబు సుమారు రు. 800 కోట్లు అప్పుతీసుకుని దారిమళ్ళించేశారు.

తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ అవసరమైన అన్నీ క్లియరెన్సులను తీసుకుని, రైతులతో మాట్లాడి భూసేకరణ పూర్తిచేశారు. కోర్టులో కేసులను క్లియర్ చేసుకున్నారు. అన్నీ అనుమతులను చేతిలో పెట్టుకుని రైతులకు ప్రత్యామ్నాయంగా ఇతర గ్రామాల్లో కాలనీలు కట్టించి ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు. అంటే చంద్రబాబుది ఎన్నికల శంకుస్థాపన అయితే జగన్ ది నిజమైన శంకుస్థాపన అని అర్థ‌మవుతోంది. దీనిపైన రాజుగారు అబద్ధాలు చెబితే ఎల్లోమీడియా రెచ్చిపోయి మళ్ళీ పెళ్ళనట్లుగా అచ్చేసింది.

First Published:  3 May 2023 5:21 AM GMT
Next Story