Telugu Global
Andhra Pradesh

"ఈనాడు" తప్పుడు రాతలపై సీఎస్‌ సీరియస్

ఈసీఐ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అన్నారు సీఎస్ జవహర్‌రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం పంపిన అధికారుల ప్యానెల్‌పై అభ్యంతరాలుంటే ఈసీఐ కొత్త ప్యానెల్ కోరుతుందన్నారు.

ఈనాడు తప్పుడు రాతలపై సీఎస్‌ సీరియస్
X

ఈనాడు తప్పుడు రాతలపై సీఎస్‌ జవహర్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ‘వీళ్లా ఎస్పీలు’ అంటూ కొత్త ఎస్పీల బదిలీలపై ఈనాడు రాసిన అబద్ధపు రాతలపై సీఎస్‌ ఖండన లేఖ విడుదల చేశారు. తన ఖండన ఈనాడు మొదటి పేజీలో ప్రచురించాలని, లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటానని సీఎస్‌ హెచ్చరించారు. ఎన్నికల సంఘం చేసిన బదిలీలను ఎలా తప్పు పడతారంటూ సీఎస్‌ ప్రశ్నించారు. ఐపీఎస్ అధికారుల సీనియారిటీ, అనుభవం పరిశీలించాకే నియమించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్ జాబితాను ఈసీఐ పరిశీలించి ఉత్తర్వులు జారీ చేసిందని సీఎస్‌ తెలిపారు.

ఈసీఐ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అన్నారు సీఎస్ జవహర్‌రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం పంపిన అధికారుల ప్యానెల్‌పై అభ్యంతరాలుంటే ఈసీఐ కొత్త ప్యానెల్ కోరుతుందన్నారు. అధికారుల బదిలీలు, నియమకాలపై సర్వాధికారాలు ఈసీఐకే ఉంటాయన్నారు. అధికారుల ప్రతిష్ట దెబ్బతీసేలా వార్తలు రాయడం అనైతికమన్నారు జవహర్‌రెడ్డి. ప్రతి అధికారి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారన్నారు. అలాంటి వారిపై ఇలా తప్పుడు, నిరాధార వార్తలు రాయడం సమంజసం కాదన్నారు. ఈనాడు మొదటి పేజీలో తన ఖండన ప్రచురించాలని.. లేదంటే లీగల్ చర్యలు తీసుకుంటానని జవహర్‌రెడ్డి హెచ్చరించారు.

మరోవైపు పురందేశ్వరి, ఈనాడు, ఆంధ్రజ్యోతిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు ఐపీఎస్‌ అధికారుల సంఘం వెల్లడించింది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఈసీకి పురేందశ్వరి ఫిర్యాదు చేయడాన్ని ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది.

First Published:  6 April 2024 2:47 AM GMT
Next Story