Telugu Global
Andhra Pradesh

నీతులు చెప్పే నేత‌లూ..ఏంటీ బూతులు?

నారా లోకేష్ పాద‌యాత్ర ప్రారంభించిన నుంచీ ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంది. పాద‌యాత్ర‌కి జ‌న‌స్పంద‌న కంటే, రోజుకొక గొడ‌వ‌తో యువ‌గ‌ళం ముగుస్తోంది.

నీతులు చెప్పే నేత‌లూ..ఏంటీ బూతులు?
X

మాట‌లే వున్నాయి, స‌భ్య‌త‌-సంస్కారం లేవు అని నిరూపించుకుంటున్నారు రాజ‌కీయ నేత‌లు. ఏ పార్టీ వారైనా క‌నీసం తాము ప్ర‌జ‌ల ముందు మాట్లాడుతున్నామ‌నే ఇంగితం లేకుండా అస‌భ్య‌మైన భాష‌తో ఆరోప‌ణ‌లు-ప్ర‌త్యారోప‌ణ‌ల‌కు దిగుతున్నారు. స‌భ్య‌త మ‌రిచి లోకేష్ ఆరోప‌ణ‌లు చేయ‌గా, సంస్కారం మ‌రిచిన‌ రోజా ప్ర‌త్యారోప‌ణ‌లు చేసి ఏపీలో పొలిటిక‌ల్ హీట్ పెంచేశారు.

నారా లోకేష్ పాద‌యాత్ర ప్రారంభించిన నుంచీ ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంది. పాద‌యాత్ర‌కి జ‌న‌స్పంద‌న కంటే, రోజుకొక గొడ‌వ‌తో యువ‌గ‌ళం ముగుస్తోంది. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేసిన నారా లోకేష్ మంత్రి రోజాపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అవినీతి, దౌర్జ‌న్యాల గురించి మాట్లాడారు.

డైమండ్ పాప అంటే ఫీల‌వుతోంద‌ని, జ‌బ‌ర్ద‌స్త్ ఆంటీ అంటూ మంత్రి రోజాని సంబోధించ‌డంతో కాక రేగింది. రోజా త‌న కుటుంబ‌స‌భ్యుల‌తో నియోజ‌క‌వ‌ర్గాన్ని దోచుకుంటున్నార‌ని లోకేష్ ఆరోపించారు. మంత్రి రోజా కూడా లోకేష్‌కి దీటుగా కౌంట‌ర్ ఇచ్చింది. లోకేష్‌ని జోకేష్ అంటూ పిలిచి వీడు, వాడు అంటూ చెల‌రేగిపోయారు. చంద్ర‌బాబు, లోకేష్‌, బ్రాహ్మణి, భువ‌నేశ్వ‌రి దోచుకోవ‌డం వ‌ల్లే చిత్తూరు జిల్లాలో పేద‌రికం పెరిగిపోయింద‌ని రోజా ఆరోపించారు. ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల భాష శృతిమించింది

లోకేష్ ఆరోప‌ణ‌ల‌కు దీటుగా మంత్రి రోజా కౌంట‌ర్ ఇవ్వ‌డంతో ఒక్క‌సారిగా నియోజ‌క‌వ‌ర్గంలో హాట్ హాట్ గా ప‌రిస్థితులు మారిపోయాయి. రోజాకి ఇస్తామంటూ చీర‌లు, గాజులు ప‌ట్టుకుని వ‌చ్చిన తెలుగు మ‌హిళ‌లు మంత్రి ఇంటిలోకి దూసుకెళ్లేందుకు యత్నించ‌డంతో ఉద్రిక్త‌త నెల‌కొంది. పోలీసులు వీరిని అడ్డుకుని స్టేష‌న్‌కి త‌ర‌లించారు.

First Published:  14 Feb 2023 1:52 PM GMT
Next Story