Telugu Global
Andhra Pradesh

CNN NEWS 18 సర్వే.. లాజిక్‌ మర్చిపోయిన లోకేశ్‌

ఇక్కడే లాజిక్ మిస్‌ అయ్యారు లోకేశ్‌. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరి 5 రోజులు కాకముందే సర్వే ఎలా చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

CNN NEWS 18 సర్వే.. లాజిక్‌ మర్చిపోయిన లోకేశ్‌
X

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వేల సందడి మొదలైంది. ఇప్పటికే సర్వే సంస్థలు తన ఫలితాలను వెల్లడించాయి. మెజార్టీ సర్వే సంస్థలు అధికార వైసీపీకి పట్టం కట్టాయి. అయితే తాజాగా CNN-న్యూస్‌ 18 ఛానల్‌ సైతం స‌ర్వే ఫలితాలను వెల్లడించింది.

ఈ సర్వేలో ఏపీలో ఎన్డీఏ కూటమి 50 శాతం ఓట్‌ షేర్‌ సాధిస్తుందని.. వైసీపీకి 41 శాతం ఓట్లు పడతాయని చెప్పుకొచ్చింది. ఎన్డీఏ కూటమికి ఏపీలో 18 ఎంపీ స్థానాలు, వైసీపీకి 7 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇదే విషయాన్ని టీడీపీ నేత నారా లోకేశ్‌ సైతం ట్వీట్ చేశారు. ఏపీలో టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన కూట‌మిదే తిరుగులేని విజ‌యం అని సర్వేలు తేల్చేస్తున్నాయంటూ జబ్బలు చరుచుకున్నారు.

అయితే ఇక్కడే లాజిక్ మిస్‌ అయ్యారు లోకేశ్‌. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరి 5 రోజులు కాకముందే సర్వే ఎలా చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో కేవలం 5 రోజుల్లో సర్వే సాధ్యమా అంటూ లోకేశ్‌కు ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు.

తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య ఈ నెల 9న పొత్తు ఖరారు కాగా.. మరుసటి రోజు సీట్ల పంపకాలపై క్లారిటీ వచ్చింది. అయితే బీజేపీ, జనసేన ఏయే స్థానాల్లో పోటీ చేస్తాయనే అంశంపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో CNN న్యూస్ - 18 సర్వే ఏ మాత్రం న‌మ్మ‌శ‌క్య‌మో అర్థం అవుతుందంటూ లోకేశ్‌కు కౌంటర్లు ఇస్తున్నారు. పెయిడ్ సర్వేలతో జనాలను మోసం చేయాలని టీడీపీ చూస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

First Published:  15 March 2024 3:21 AM GMT
Next Story