Telugu Global
Andhra Pradesh

లోకేష్ చుట్టు ఉచ్చు బిగిస్తున్న జగన్

సడన్ గా వారంరోజుల క్రితం అభ్యర్థి విషయంలో చేనేత సామాజికవర్గానికే చెందిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు, చిరంజీవితో చర్చించారు.

లోకేష్ చుట్టు ఉచ్చు బిగిస్తున్న జగన్
X

రాబోయే ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేష్‌ను ఓడించాలని జగన్మోహన్ రెడ్డి గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అందుకనే అన్నీ వైపుల నుండి ఉచ్చు బిగిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీ వదిలి వెళ్ళిపోయిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని మళ్ళీ పార్టీలో చేర్చుకున్నారు. జగన్ మీద అలిగి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి షర్మిలతో పాటు కాంగ్రెస్ లో చేరారు.

అయితే నెలరోజులు కూడా తిరగకముందే షర్మిలతో పొసగక తిరిగి వైసీపీలోకి వచ్చేశారు. ఆళ్ళ రాకతో నియోజకవర్గంలో సమీకరణాలు మారిపోతున్నాయి. మంగళగిరిలో బీసీ సామాజికవర్గంలో చేనేతలు చాలా ఎక్కువ. వీళ్ళతో పాటు ఎస్సీ, మైనారిటీ, రెడ్డి తదితర సామాజికవర్గాలున్నాయి. లోకేష్ ను రెండోసారి కూడా ఓడించేందుకు జగన్ వ్యూహాత్మకంగా చేనేత కుటుంబానికి చెందిన గంజి చిరంజీవిని టీడీపీలో నుండి వైసీపీలో చేర్చుకుని నియోజకవర్గం ఇన్చార్జిని చేశారు. దాంతో అందరు చిరంజీవికే టికెట్ ఖాయమనుకున్నారు.

అయితే సడన్ గా వారంరోజుల క్రితం అభ్యర్థి విషయంలో చేనేత సామాజికవర్గానికే చెందిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు, చిరంజీవితో చర్చించారు. ఈ సమావేశంలోనే రాబోయే ఎన్నికల్లో కమలను అభ్యర్థిగా ప్రకటించాలని జగన్ డిసైడ్ అయ్యారట. అయితే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదంతే. కమలకు ఎమ్మెల్సీ మురుగుడు ద‌గ్గ‌రి బంధువు. కాబట్టి కమల గెలుపున‌కు మురుగుడు, చిరంజీవి గట్టిగా పనిచేస్తే లోకేష్ ఓట‌మి ఖాయ‌మే.

వైసీపీ ఓట్లు+రెడ్డి ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థిగా ఆళ్ళ చీల్చుకుంటారు కాబట్టి తన గెలుపు ఖాయమని లోకేష్ అండ్ కో అనుకున్నారు. రాబోయే ఎన్నికల్లో త్రిముఖ పోటీ కాబట్టి తాను ఈజీగా గెలుస్తానని కూడా లోకేష్ అంచనా వేసుకున్నారు. అయితే వీళ్ళు ఊహించని విధంగా ఆళ్ళ తిరిగి వైసీపీలో చేరిపోయారు. కమల లేదా చిరంజీవి గెలుపున‌కు పనిచేస్తానని జగన్ కు ఆళ్ళ మాటిచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. అంటే ఒకవైపు చేనేత సామాజికవర్గం ఓట్లు, మరోవైపు ఆళ్ళ వర్గం+చిరంజీవి లేదా కమల సహకారం, అలాగే సంక్షేమ పథకాల లబ్దిదారుల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుపు తేలికవుతుందనే చర్చ పెరిగిపోతోంది. చూస్తుంటే లోకేష్ చుట్టూ జగన్ జాగ్రత్తగా ఉచ్చు బిగిస్తున్నట్లే ఉంది. చివరకు ఏమవుతుందో చూడాలి.

First Published:  21 Feb 2024 5:19 AM GMT
Next Story