Telugu Global
Andhra Pradesh

రోజుకు 3 నియోజకవర్గాలు.. జగన్‌ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇదే!

ఎన్నికల ప్రచారంలో భాగంగా 26 జిల్లాల్లో సభలు, రోడ్‌ షోల్లో వైసీపీ అధినేత జగన్ పాల్గొంటారు. రోజుకు కనీసం 3 నియోజకవర్గాల్లో చుట్టేసేలా ప్లాన్ చేస్తున్నారు.

రోజుకు 3 నియోజకవర్గాలు.. జగన్‌ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇదే!
X

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఓ వైపు ప్రతిపక్ష పార్టీలు కూటమి కడుతుంటే.. మరోవైపు సింగిల్‌గా, పక్కా ప్రణాళికతో జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు వైసీపీ అధినేత‌, సీఎం జగన్‌. ఇప్పటికే సిద్ధం సభలతో హోరెత్తిస్తున్నారు. ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో చివరి సిద్ధం సభను నిర్వహించనుంది వైసీపీ.

ఇక త్వరలోనే పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు జగన్. ఇందుకు సంబంధించి షెడ్యూల్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈనెల 16 నుంచి ఎన్నికల ప్రచారానికి జగన్ శ్రీకారం చుడతారని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్.

ఎన్నికల ప్రచారంలో భాగంగా 26 జిల్లాల్లో సభలు, రోడ్‌ షోల్లో వైసీపీ అధినేత జగన్ పాల్గొంటారు. రోజుకు కనీసం 3 నియోజకవర్గాల్లో చుట్టేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది.

First Published:  9 March 2024 2:29 PM GMT
Next Story