Telugu Global
Andhra Pradesh

ఆంధ్రా డెస్టినీ.. విశాఖపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇప్పుడు సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్న విశాఖ రేపు ఆంధ్రా డెస్టినీ కాబోతోంది అని చెప్పారు జగన్.

ఆంధ్రా డెస్టినీ.. విశాఖపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పై సీఎం జగన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లతో జరిగిన సమావేశంలో ఆయన రాజధాని గురించి మాట్లాడారు. ఇప్పుడు సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్న విశాఖ రేపు ఆంధ్రా డెస్టినీ కాబోతోంది అని చెప్పారు జగన్.


"ఈ రోజు ఎలాగూ అందరూ విశాఖపట్నానికి వచ్చారు. కొంతమంది విశాఖపట్నం వాసులు, కొంత మంది బయట నుంచి కూడా వచ్చిన వాళ్లు. ఈరోజు ఈ సిటీని చూస్తున్నారు కదా.. ఈ సిటీ ఆఫ్ డెస్టినీ అనేది రేపు పొద్దున ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుందన్నది మాత్రం ఈ సందర్భంగా కచ్చితంగా తెలియజేస్తున్నాను." అని అన్నారు జగన్. ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఈ సిటీలో కూర్చోవడం మొదలు పెడతాడో, ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఈ సిటీ నుంచి పరిపాలన చేయడం మొదలు పెడతాడో అప్పుడు ఈ సిటీ హైదరాబాద్ తో పోటీ పడే పడే పరిస్థితికి వస్తుందన్నారు. చెన్నై, బెంగళూరుతో పోటీ పడే పరిస్థితికి వస్తుందని చెప్పారు. ఐటీని అత్యున్నత స్టేజ్ కి తీసుకెళ్లే పరిస్థితి నెలకొంటుందని వివరించారు.

విశాఖ నుంచే పాలన..

విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించినా కూడా వివిధ కారణాలతో ఈ దఫా అది సాధ్యం కాలేదు. వచ్చేసారి తన ప్రమాణ స్వీకారాన్ని కూడా విశాఖ నుంచే చేపడతానని సీఎం జగన్ స్పష్టం చేశారు. పాలన కూడా అక్కడినుంచే మొదలు పెడతానన్నారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ కూడా విశాఖ రాజధాని గురించి, జగన్ ప్రమాణ స్వీకారం గురించి మరోసారి స్పష్టం చేశారు. తాజాగా సీఎం జగన్ ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ విశాఖ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో విశాఖపై మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

First Published:  23 April 2024 12:03 PM GMT
Next Story