Telugu Global
Andhra Pradesh

అక్కడి హోర్డింగులకు ఈసీ ఓకే

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాల్లో 4 నుంచి 8 అడుగుల బ్యానర్, ఒక జెండాను అనుమతించాలని అధికారులకు చెప్పారు.

అక్కడి హోర్డింగులకు ఈసీ ఓకే
X

పార్టీల శాశ్వత కార్యాలయాల్లో హోర్డింగులు తొలగించొద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో శాశ్వత ప్రాతిపదికన ఉన్న రాజకీయ పార్టీల కార్యాలయాల్లో హోర్డింగులను కొనసాగించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన క్లారిటీ ఇచ్చారు.

మంగళవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో తమ దృష్టికి వచ్చిన అంశాల నేపథ్యంలో ముఖేష్‌కుమార్‌ మీనా ఈ ఆదేశాలిచ్చారు. ఇక సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాల్లో 4 నుంచి 8 అడుగుల బ్యానర్, ఒక జెండాను అనుమతించాలని అధికారులకు చెప్పారు. దీనికి తోడు ఇంటింటి ప్రచారంపై త్వరలో నిర్ణయం ముందుగా అనుమతి పొందిన తర్వాతే అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికి వెళ్లాలనే నిబంధన సరికాదని, దానిని పునర్ స‌మీక్షించాలని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారని ఆయన తెలిపారు. ఈ నిబంధన అమలు విషయంలో భారత ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లామని, దీనిపై త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

First Published:  28 March 2024 2:52 AM GMT
Next Story