Telugu Global
Andhra Pradesh

జగన్ ని టీవీలో చూపించిన చంద్రబాబు

అప్పుడు అవసరం లేని భోగాపురం ఎయిర్ పోర్ట్ ఇప్పుడు కిరీటం, వజ్రం ఎలా అయిందని ప్రశ్నించారు. ఏ ఒక్క విషయంలోనైనా ఈ ఊసరవెల్లికి క్లారిటీ ఉందా? అని నిలదీశారు చంద్రబాబు.

జగన్ ని టీవీలో చూపించిన చంద్రబాబు
X

ఇటీవల వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెడితే చంద్రబాబు వీడియోలను టీవీల్లో చూపిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు కూడా అదే బాట పట్టారు. సీఎం జగన్ మాటల్ని అప్పుడు-ఇప్పుడు అంటూ టీవీలో చూపించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ గురించి జగన్ అప్పుడేమన్నారు, ఇప్పుడేమంటున్నారు అనే వీడియోలు చూపించి.. ఊసరవెల్లిలా సీఎం మాటలు మారుస్తున్నారని మండిపడ్డారు.

ప్రతిపక్షంలో ఉండగా.. విశాఖ ఎయిర్ పోర్టే ఖాళీగా ఉంటోందని, ఇక భోగాపురం ఎయిర్‌ పోర్టు అవసరమేముందని జగన్ అన్నారు. వ్యవసాయ భూముల్ని రైతుల నుంచి లాగేసుకుని వారి పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. అదే జగన్ ఈరోజు భోగాపురం ఉత్తరాంధ్రకు కిరీటం అన్నారు. ఈ వీడియోలను వెంట వెంటనే చూపిస్తూ చంద్రబాబు మండిపడ్డారు. అప్పుడు అవసరం లేని భోగాపురం ఎయిర్ పోర్ట్ ఇప్పుడు కిరీటం, వజ్రం, డైమండ్‌ ఎలా అయిందని ప్రశ్నించారు. ఏ ఒక్క విషయంలోనైనా ఈ ఊసరవెల్లికి క్లారిటీ ఉందా? అని నిలదీశారు.


వైసీపీ పాలన గురించి రజినీకాంత్‌ మాట్లాడలేదని, హైదరాబాద్‌ అభివృద్ధి గురించి మాట్లాడితే మీకెందుకు కోపం వస్తుందని వైసీపీ నేతల్ని ప్రశ్నించారు చంద్రబాబు. కేంద్రం విడుదల చేసిన లెక్కల ప్రకారం పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్‌ కిందకు వెళ్లిపోతోందని అన్నారు. పెట్టుబడుల విషయంలో దేశంలోని రాష్ట్రాల లిస్ట్ లో కింద నుంచి ఏపీ ఏడో స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు.

ఏపీలో విద్యలో నాణ్యత పడిపోవడం వల్లే విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెళ్లి ఎంసెట్‌ రాస్తున్నారని అన్నారు చంద్రబాబు. రాష్ట్రం నుంచి దాదాపు 70వేల మంది విద్యార్థులు తెలంగాణ ఎంసెట్‌ రాస్తున్నారని చెప్పారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయట్లేదని, డీఎస్సీ వేయలేదని, పీజీ చదివే విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌ లు ఆపేశారని, ఫీజుల నియంత్రణ పేరుతో ప్రముఖ యూనివర్శిటీలను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు.

First Published:  3 May 2023 4:15 PM GMT
Next Story