Telugu Global
Andhra Pradesh

బ్రాహ్మణ, వైశ్య, కాపు వర్గాలకు చంద్రబాబు తీరని ద్రోహం.. ఎలాగంటే..?

టీడీపీ నుంచి 14, జనసేన నుంచి 9 సీట్లు మాత్రమే కాపులకు దక్కాయి. వైసీపీ ఏకంగా 31 సీట్లు కాపు వర్గానికి కేటాయించింది. ఎంపీ సీట్లు మరీ దారుణం. వైసీపీ 5 ఎంపీ సీట్లు కాపులకు కేటాయిస్తే, టీడీపీ కూటమి వారిని 3 సీట్లకు పరిమితం చేసింది.

బ్రాహ్మణ, వైశ్య, కాపు వర్గాలకు చంద్రబాబు తీరని ద్రోహం.. ఎలాగంటే..?
X

కమ్మ వర్గానికి మేలు చేసే క్రమంలో ఏపీలోని అన్ని సామాజిక వర్గాలకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారు, చేస్తూనే ఉన్నారు. కాపులకు రాజ్యాధికారం తెస్తుందనుకున్న జనసేనను కూడా కూటమిలో కలిపేసుకుని పీక నొక్కేశారు బాబు. సీట్ల కేటాయింపులో బాబు జిమ్మిక్కులు, మేజిక్కులు చూస్తే ఆయన నక్కజిత్తులు ఎలాంటివో అర్థమవుతుంది.

కాపులకు వైసీపీ అండ..

జనసేనను కూటమిలో కలుపుకున్న చంద్రబాబు కాపులకు కేవలం 23 సీట్లు వచ్చేలా చేశారు. టీడీపీ నుంచి 14, జనసేన నుంచి 9 సీట్లు మాత్రమే కాపులకు దక్కాయి. వైసీపీ ఏకంగా 31 సీట్లు కాపు వర్గానికి కేటాయించింది. ఎంపీ సీట్లు మరీ దారుణం. వైసీపీ 5 ఎంపీ సీట్లు కాపులకు కేటాయిస్తే, టీడీపీ కూటమి వారిని 3 సీట్లకు పరిమితం చేసింది. అంటే జనసేనను కూటమిలో కలుపుకున్నా.. కాపులకు ప్రాధాన్యత దక్కకుండా చంద్రబాబు తెలివిగా అడ్డుకట్ట వేశారు.

బ్రాహ్మణ, వైశ్య వర్గాలకు మొండిచేయి..

బ్రాహ్మణ, వైశ్య, కాపు వర్గాలు ఏపీలో బీజేపీవైపు కొద్దిగా మొగ్గు చూపుతాయి. అలాంటి వర్గాలకు బీజేపీలో అసలు టికెట్లే లేకుండా చేశారు చంద్రబాబు. బీజేపీ తీసుకున్న 10 అసెంబ్లీ సీట్లలో 3 కమ్మ వర్గానికి దక్కేలా చక్రం తిప్పారు. 6 లోక్ సభ సీట్లలో ఒకటి కమ్మ వర్గానికి కేటాయించేలా ప్లాన్ వేశారు. మొత్తమ్మీద ఏపీలో బీజేపీ సీట్లలో బ్రాహ్మణ, వైశ్య, కాపులకు చోటే లేకుండా చేశారు చంద్రబాబు. ఎలా చూసుకున్నా కూటమి వల్ల అంతిమంగా లబ్ధి పొందింది కమ్మ వర్గం కావడం ఇక్కడ విశేషం.

పగలు బీజేపీతో.. రాత్రి కాంగ్రెస్ తో

చీకటి చంద్రుడు చంద్రబాబు పగలు బీజేపీతో ఉంటారు, రాత్రిళ్లు కాంగ్రెస్ తో రహస్య మంతనాలు సాగిస్తారు. భవిష్యత్తులో తన అవసరాలకు పనికొస్తారనే ఉద్దేశంతోటే ఏపీ బీజేపీ అధ్యక్షరాలిగా పురంధేశ్వరిని, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలకు పదవులిప్పించుకున్నారు. కాంగ్రెస్, బీజేపీలో చంద్రబాబుకి అంత పలుకుబడి ఉందా అనే అనుమానం రావొచ్చు. కానీ డబ్బుతో ఏదయినా సాధ్యం చేయగల సమర్థుడు చంద్రబాబు. కాంగ్రెస్, బీజేపీకి దొడ్డిదారిలో ఎలక్షన్ ఫండ్ ముట్టజెప్పి ఆ రెండు పోస్ట్ లు కొనేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు కావడం వెనక కూడా చంద్రబాబు హస్తం ఉందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. బాబు స్లీపర్ సెల్ గా భావించే సీఎం రమేష్, బీజేపీలో చేరడం, అనకాపల్లి టికెట్ సాధించడం వెనక.. పార్టీ ఫండ్ ల వ్యవహారం కీలకంగా మారింది. అటు షర్మిల, సునీతతో జగన్ ఓట్ బ్యాంక్ ని దెబ్బతీయడానికి ట్రై చేస్తున్నారు చంద్రబాబు. ఇన్ని కుట్రలు, కుయుక్తులు జగన్ పై పనిచేస్తాయా..? 2024 ఎన్నికల్లో చంద్రబాబు అనుకున్నది సాధ్యమవుతుందా..? వేచి చూడాలి.

First Published:  7 April 2024 6:25 AM GMT
Next Story