Telugu Global
Andhra Pradesh

సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం కేవియట్‌ పిటిషన్‌.. - స్కిల్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ కేసులో ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలు కూడా వినాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.

సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం కేవియట్‌ పిటిషన్‌.. - స్కిల్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం
X

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణానికి సంబంధించి ఏపీ హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయన లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టుకు సెలవులు ఉండటంతో ఈ పిటిషన్‌పై విచారణ అక్టోబర్‌ 3న జరుగనుంది. తనపై నమోదైన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసును కొట్టివేయాలని చంద్రబాబు ఈ పిటిషన్‌ ద్వారా కోర్టును కోరిన నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ కేసులో ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలు కూడా వినాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఇదే సమయంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు పాత్రపై ఎన్నో ఆధారాలు సీఐడీ వద్ద ఉన్నాయని, విద్యార్థులకు శిక్షణ ఇస్తామని కోట్ల రూపాయలు కుంభకోణం చేశారని ఆ పిటిషన్‌లో పేర్కొంది. నిధులను షెల్‌ కంపెనీల ద్వారా రూటు మళ్లించి ఎన్‌క్యాష్‌ చేసుకున్నారని, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నాయని తెలిపింది. ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కూడా కేంద్ర పరిధిలోని జీఎస్టీ శాఖే అనే విషయాలను ఆ పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం వివరించింది. అంతేకాదు.. ఈ కేసులో తమ వాదనను న్యాయస్థానం ముందు ఉంచుతామని కోరింది.

First Published:  29 Sep 2023 2:27 AM GMT
Next Story