Telugu Global
Andhra Pradesh

భూమా అఖిల ప్రియని హడావుడిగా ఆసుపత్రికి తరలింపు.. మళ్లీ జైలుకి

అఖిల ప్రియకి తొలుత ఈసీజీ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. అనంతరం కార్డియాలజీకి తరలించారు. అక్కడ కూడా ఆమెకి ఈసీజీ, 2డి ఎకో టెస్టులు చేయగా.. రిపోర్ట్‌లు అన్నీ నార్మల్‌గానే వచ్చాయి.

భూమా అఖిల ప్రియని హడావుడిగా ఆసుపత్రికి తరలింపు.. మళ్లీ జైలుకి
X

నంద్యాలలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియని హడావుడిగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి జైలు అధికారులు తరలించారు. ఛాతిలో నొప్పిగా ఉందంటూ భూమా అఖిల ప్రియ చెప్పడంతో జైలు సూపరింటెండెంట్ పర్యవేక్షణలో అధికారులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.

ఛాతిలో నొప్పి రావడంతో అఖిల ప్రియకి తొలుత ఈసీజీ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. అనంతరం కార్డియాలజీకి తరలించారు. అక్కడ కూడా ఆమెకి ఈసీజీ, 2డి ఎకో టెస్టులు చేయగా.. రిపోర్ట్‌లు అన్నీ నార్మల్‌గానే వచ్చాయి. దాంతో జైలు అధికారులు మళ్లీ గంటల వ్యవధిలోనే అఖిల ప్రియని కర్నూలులోని మహిళా సబ్‌ జైలుకి తరలించారు. అఖిల ప్రియని ఆసుపత్రికి తీసుకెళ్లడం, మళ్లీ జైలుకి తరలించిన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు.

నంద్యాలలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా అతనికి స్వాగతం పలికేందుకు భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బా రెడ్డి వర్గీయులు పోటీపడ్డారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకోగా.. భూమా అఖిల ప్రియ వర్గం ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసింది. దాంతో అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అఖిల ప్రియతో పాటు మరో 11 మందిని కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో అఖిల ప్రియకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

First Published:  19 May 2023 7:02 AM GMT
Next Story