Telugu Global
Andhra Pradesh

టికెట్లను ప్రకటించేసుకున్న భూమా... చంద్రబాబుకు షాక్

రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులుగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అన్నీ తెలిసినా చంద్రబాబు చోద్యం చూస్తు కూర్చున్నారే కానీ అఖిల మీద యాక్షన్ తీసుకునే ధైర్యం చేయలేకపోతున్నారు.

టికెట్లను ప్రకటించేసుకున్న భూమా... చంద్రబాబుకు షాక్
X

చంద్రబాబునాయుడు చేతకానితనాన్ని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేతల్లో ఎవరి మీదా యాక్షన్ తీసుకోలేని చంద్రబాబు పిరికితనం అఖిలకు బాగా అర్థ‌మైనట్లుంది. అందుకనే నంద్యాల, ఆళ్ళగడ్డ నియోజకవర్గాల్లో తనిష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా నంద్యాలలో జరిగిన మీటింగ్‌లో రెండు నియోజకవర్గాల్లో తామే పోటీ చేయబోతున్నట్లు ప్రకటించేశారు. ఆళ్ళగడ్డలో తాను, నంద్యాలలో తన సోదరుడు భూమా జగద్విఖ్యాతరెడ్డి పోటీ చేయబోతున్నట్లు డిక్లేర్ చేశారు. అఖిల ప్రకటన చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ ఇచ్చినట్లే అని అనుకోవాలి.

ఎందుకంటే అఖిలను చంద్రబాబు పార్టీ కార్యక్రమాల్లో ఎంటర్ టైన్ చేయటంలేదు. కనీసం మీటింగ్‌లకు కూడా రానివ్వటంలేదు. అలాగని ఆమె మీద యాక్షన్ తీసుకున్నారా అంటే అదీలేదు. తనంతట తానుగానే ఆమె పార్టీ వదిలి వెళ్ళిపోయేట్లు చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. అయితే చంద్రబాబు ఆలోచనను గ్రహించిన అఖిల అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబును పట్టించుకోకుండా పై రెండు నియోజకవర్గాల్లోనూ తిరిగేస్తున్నారు. పార్టీ నేతలు ఎవరూ కలవకపోయినా సొంత మనుషులతో తిరిగేస్తున్నారు.

రాబోయే ఎన్నికల్లో తమిద్దరి గెలుపును ఎవరు అడ్డుకుంటారో చూస్తామని సవాళ్ళు విసురుతున్నారు. విషయం ఏమిటంటే గతంలో ఎప్పుడో అఖిలకు ఆళ్ళగడ్డ బాధ్యతలు అప్పగించారు. అయితే ఆమేమో నంద్యాలలో తిరుగుతున్నారు. నంద్యాల ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని చంద్రబాబు ప్రకటించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ్రహ్మానందరెడ్డే అభ్య‌ర్థి అని సీనియర్ల ముందు చెప్పేశారు. అయితే ఇపుడు బ్రహ్మానందరెడ్డిని ఇన్‌చార్జి, అభ్యర్థిగా అఖిల అంగీకరించటంలేదు. అంటే చంద్రబాబు నియామకాన్ని కూడా అఖిల కుదరదు పొమ్మంటున్నారు.

సొంతంగా తమిద్దరి టికెట్లను తామే ప్రకటించేసుకున్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులుగా వీళ్ళు ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అన్నీ తెలిసినా చంద్రబాబు చోద్యం చూస్తు కూర్చున్నారే కానీ అఖిల మీద యాక్షన్ తీసుకునే ధైర్యం చేయలేకపోతున్నారు. అఖిలను పార్టీలో నుండి బయటకు పంపేయమని ఏవీ సుబ్బారెడ్డి, బోండా ఉమ, ఫరూక్ లాంటి సీనియర్లు పదేపదే చెబుతున్నా పట్టించుకోవటంలేదు. పోనీ భూమా ఫ్యామిలీకే టికెట్లను ప్రకటించారా అంటే అదీలేదు. అందుకనే అఖిల తనకు తానుగానే రెండు టికెట్లను ప్రకటించేసుకున్నారు. మరి చంద్రబాబు ఎలా రియాక్టవుతారో చూడాలి.


First Published:  27 Aug 2023 5:43 AM GMT
Next Story