Telugu Global
Andhra Pradesh

విశాఖే రాజధాని.. రుషికొండలో స్థలం కొన్న బాలయ్య

మళ్లీ జగన్ గెలిచి, విశాఖ పూర్తి స్థాయి రాజధాని అయితే రియల్ బూమ్ మరింత పెరిగిపోతుందని, అందుకే ముందు జాగ్రత్తగా అక్కడ స్థలాలు కొంటున్నారని తేలిపోయింది.

విశాఖే రాజధాని.. రుషికొండలో స్థలం కొన్న బాలయ్య
X

విశాఖలో టీడీపీ నాయకులు భూములు కొనకూడదనే నిబంధనేమీ లేదు. అయితే హిందూపురం ఎమ్మెల్యే, మహా అయితే టీడీపీ రాజధాని అమరావతిలో ఉండాల్సిన ఎమ్మెల్యే ఎక్కడో విశాఖలో స్థలాలు కొనడం ఏంటి..? ఎన్నికల అఫిడవిట్ లో 2.15 ఎకరాల స్థలం తనకు విశాఖలో ఉందని పేర్కొన్నారు బాలకృష్ణ. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

విశాఖకు జై కొట్టినట్టేనా..?

గత టీడీపీ హయాంలో అందరూ అమరావతి ప్రాంతంలో భూములు కొన్నారు. బాలకృష్ణకూడా ఆరున్నర కోట్ల రూపాయలతో అక్కడ స్థలాలు తీసుకున్నారు. ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాభవంతో అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పడిపోయింది. వైసీపీ వచ్చాక విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కు ప్రయత్నాలు జరగడంతో అక్కడే స్థలాలు తీసుకోడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. అందులో బాలకృష్ణ కూడా ఒకరు. టీడీపీ గెలుస్తుంది, అమరావతే రాజధాని అంటూ టముకు వేస్తున్న ఆ పార్టీ నేతలు సైలెంట్ గా విశాఖలో కూడా స్థలాలు కొనడంలో ఆంతర్యమేంటి..? మళ్లీ జగన్ గెలిచి, విశాఖ పూర్తి స్థాయి రాజధాని అయితే రియల్ బూమ్ మరింత పెరిగిపోతుందని, అందుకే ముందు జాగ్రత్తగా అక్కడ స్థలాలు కొంటున్నారని తేలిపోయింది. అంటే జగన్ గెలుపుని, విశాఖ రాజధానిని పరోక్షంగా బాలకృష్ణ కూడా అంగీకరించినట్టే లెక్క.

ఇక్కడ కూడా జిమ్మిక్కులే..!

విశాఖలో బీచ్ రోడ్ కి ఎదురుగా ఉన్న 10,255 చదరపు గజాల (2.15 ఎకరాలు) స్థలాన్ని జనవరిలో బాలకృష్ణ కొన్నారు. రూ.65 కోట్లకు ఈ డీల్ కుదిరింది. అయితే ఈ స్థలాన్ని NBK క్లాసిక్‌–2 అనే ఓ లిమిటెడ్‌ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్‌ కంపెనీ పేరుతో కొన్నారు. ఇందులో బాలయ్య కుటుంబానికి 100 శాతం వాటాలున్నాయి. హిందూపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన సమర్పించిన అఫిడవిట్ లో ఈ వివరాలన్నీ బయటపడ్డాయి. ఈ వ్యవహారంతో అమరావతి కథ కంచికేనని బాలయ్య పరోక్షంగా హింటిచ్చినట్టు తేలిపోయింది.

First Published:  22 April 2024 1:44 AM GMT
Next Story