Telugu Global
Andhra Pradesh

హిందూపురంలో దబిడ దిబిడ.. అభిమాని చెంప పగలగొట్టిన బాలయ్య

హెలికాప్టర్ ల్యాండ్ అవ్వగానే అభిమానులు ఆయన్ను చుట్టుముట్టారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ దగ్గరకు వచ్చారు. సెల్ఫీకోసం తన వద్దకు వచ్చిన అభిమాని చెంప పగలగొట్టారు బాలయ్య.

హిందూపురంలో దబిడ దిబిడ.. అభిమాని చెంప పగలగొట్టిన బాలయ్య
X

బాలకృష్ణ వస్తున్నారంటే అభిమానులకు తిట్లు, తన్నులు కామన్. ఆ సెంటిమెంట్ ఈరోజు కూడా కొనసాగింది. 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర' పేరుతో రాయలసీమ యాత్ర మొదలు పెడుతున్న బాలకృష్ణ.. తొలిరోజే ఓ అభిమాని చెంప పగలగొట్టారు. సెల్ఫీకోసం దగ్గరకు రాగా విసుక్కున్న ఆయన అభిమానిపై చేయి చేసుకున్నారు. అయితే ఇదంతా వారిపై బాలయ్యకున్న ప్రేమ అని కవర్ చేసుకోవడం టీడీపీకి అలవాటే. ఇప్పుడు కూడా అదే కవరింగ్ గేమ్ మొదలైంది.


రెండు రోజులపాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో బాలయ్య 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర' మొదలుపెట్టబోతున్నారు. కదిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు ఆయన ఈరోజు హెలికాప్టర్ లో వచ్చారు. హెలికాప్టర్ ల్యాండ్ అవ్వగానే అభిమానులు ఆయన్ను చుట్టుముట్టారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ దగ్గరకు వచ్చారు. కొందరు సెల్ఫీకోసం ఎగబడ్డారు. ఈ క్రమంలో బాలయ్యకు కోపం వచ్చింది. సెల్ఫీకోసం వచ్చిన ఓ అభిమాని చెంప పగలగొట్టారు.

గతంలో కూడా బాలకృష్ణ పర్యటనల్లో ఈ చేతి దెబ్బలు, చెంప దెబ్బలు కామన్ గా కనపడేవి. ఈసారి ప్రచారం ఇంకా మొదలు కాకుండానే బాలకృష్ణ బోణీ కొట్టారు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో చుట్టూ ఉన్నవారికే తెలియదు. హెలికాప్టర్ దిగగానే దగ్గరకు వెళ్లి సెల్ఫీ దిగాలనుకున్న ఆ అభిమాని మాత్రం బాలయ్య దెబ్బకు హర్ట్ అయ్యారు. వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయారు. అయితే ఈ వ్యవహారాన్ని టీడీపీ కవర్ చేసుకోవాలనుకోవడం, దాన్ని బాలయ్య ప్రేమగా చెప్పుకోవడం విశేషం.

First Published:  13 April 2024 7:06 AM GMT
Next Story