Telugu Global
Andhra Pradesh

ఏపీ గ్రూప్-2 ఫలితాలు విడుదల.. మెయిన్స్ ఎప్పుడంటే..?

ఈరోజు ఫలితాలు విడుదల చేశారు అధికారులు. ఎలాంటి హడావిడి లేకుండా నేరుగా వెబ్ సైట్ లో రిజల్ట్ ఉంచారు.

ఏపీ గ్రూప్-2 ఫలితాలు విడుదల.. మెయిన్స్ ఎప్పుడంటే..?
X

ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ కి ఎంపిక చేశారు. జులై 28న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరుగుతుందని కూడా ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 25వ తేదీన ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగింది. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికలకు గ్రూప్-2 నియామక ప్రక్రియకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు ఇదివరకే స్పష్టం చేశారు. ఈరోజు ఫలితాలు విడుదల చేశారు అధికారులు. ఎలాంటి హడావిడి లేకుండా నేరుగా వెబ్ సైట్ లో రిజల్ట్ ఉంచారు. క్వాలిఫై అయిన వారి లిస్ట్ తో ఒక పీడీఎఫ్ ఫైల్ అడ్ లోడ్ చేశారు. రిజెక్టెడ్ లిస్ట్ అంటూ మరో పీడీఎఫ్ కూడా వెబ్ సైట్ లో ఉంచారు.

ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్‌ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 4,63,517 మంది హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17 శాతం మంది హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. పరీక్ష కఠినంగా ఉండటంతో విద్యార్థులు ఆందోళ చెందుతూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టారు. వాస్తవానికి 1:50 నిష్పత్తిలో మెయిన్స్ కి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉన్నా.. పరీక్ష పేపర్ కఠినంగా ఉండటంతో.. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు.

జులై-28న మెయిన్స్..

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు కూడా తగినంత సమయం ఇచ్చారు అధికారులు. ఏపీలో ఎన్నికల హడావిడి మే-13తో పూర్తవుతుంది. ఆ తర్వాత జూన్-4న ఫలితాలు వస్తాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత దాదాపు రెండు నెలలకు జులై-28న మెయిన్స్ పరీక్ష జరుగుతుంది.

First Published:  10 April 2024 12:56 PM GMT
Next Story