Telugu Global
Andhra Pradesh

అమిత్ షా అమాయకుడు.. వారాహి యాత్ర అంటే కాశీ యాత్రా..?

కేంద్రంపై ప్రత్యేక హోదాకు సంబంధించి పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు బొత్స. పోరాటానికి ఆకారం ఉంటుందా...? అది కనపడుతుందా అని లాజిక్ తీశారు.

అమిత్ షా అమాయకుడు.. వారాహి యాత్ర అంటే కాశీ యాత్రా..?
X

అమిత్ షా పై వైసీపీ నేతలు సెటైర్లు పేలుస్తున్న వేళ, ఆయనపై వెటకారంతో కూడిన సానుభూతి చూపించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అమిత్ షా అమాయకుడని, ఆయన ఏవేవో మాట్లాడుతుంటారని అన్నారు. అసలు కేంద్ర రాష్ట్ర సంబంధాలు చెడిపోయాయని ఎవరన్నారంటూ మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు. కేంద్రంపై ప్రత్యేక హోదాకు సంబంధించి పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు బొత్స. పోరాటానికి ఆకారం ఉంటుందా...? అది కనపడుతుందా అని మరో లాజిక్ తీశారు.

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా హోదా గురించి అడిగామని, తమ ఎంపీలు నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారని చెప్పారు బొత్స. దేశానికి సంబంధించిన అంశం వస్తే బిల్లుల విషయంలో కేంద్రానికి మద్దతు ఇస్తామన్నారు. ఏపీ విషయానికొస్తే బీజేపీకి ఉన్న ఓట్ బ్యాంక్ ఎంత అని సెటైర్లు వేశారు బొత్స.

వారాహి అంటే..?

పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై కూడా సెటైర్లు పేల్చారు మంత్రి బొత్స. తనకు కాశీ యాత్ర తెలుసని, ఈ వారాహి యాత్ర ఏంటని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ యాత్రలకు పర్మిషన్లు ఇవ్వడం పాలనలో భాగమన్నారు. సెలబ్రిటీలు పర్మిషన్ తీసుకుంటారని చెప్పారు. పవన్ యాత్రపై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా యాత్రలు చేసుకోవాలని సూచించారు.

వైసీపీ విముక్త అంటే..?

అసలు వైసీపీ విముక్త అంటే ఏంటి? విద్యా విధానం, రైతులకు జరిగే మేలు, వైద్య విధాన నిర్ణయాలన్నిటినీ ఆపేస్తారా..? అని ప్రశ్నించారు మంత్రి బొత్స. తాము ఇప్పటికే ఒకటి ఇస్తుంటే, పవన్ పార్టనర్ రెండు ఇస్తామంటూ ముందుకొస్తున్నారని చెప్పారు. అంతిమంగా రాష్ట్ర ప్రజలు కోరుకునేదే జరుగుతుందన్నారు.

First Published:  14 Jun 2023 9:30 AM GMT
Next Story