Telugu Global
Andhra Pradesh

పెన్షన్ల పంపిణీపై హైకోర్టు వ్యాఖ్యలు.. జగన్ ప్రభుత్వంపై పరోక్ష ప్రశంసలు

మిగతా రాష్ట్రాలకంటే ఏపీ భిన్నంగా ఉందని అర్థమవుతోంది. ఇతర ఏ రాష్ట్రంలోనూ వృద్ధులు, వికలాంగులకు లేని సౌకర్యం సీఎం జగన్ మాత్రమే ఏపీలోని లబ్ధిదారులకు కల్పించారని రుజువైంది.

పెన్షన్ల పంపిణీపై హైకోర్టు వ్యాఖ్యలు.. జగన్ ప్రభుత్వంపై పరోక్ష ప్రశంసలు
X

"వాలంటీర్లు లేని రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ జరగడంలేదా..?"

ఇంటింటి పెన్షన్ల పంపిణీపై వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం కొట్టి వేస్తూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలివి. అయితే ఈ వ్యాఖ్యల్ని ఎల్లో మీడియా చిలువలు పలువలు చేస్తోంది, తమకి అనుకూలంగా మార్చుకుంటోంది. వాస్తవానికి కోర్టు వ్యాఖ్యలతో మరోసారి ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు హైలైట్ అయ్యాయి. వాలంటీర్ వ్యవస్థ మిగిలిన రాష్ట్రాల్లో లేదనే విషయం స్పష్టమైంది. ఆయా రాష్ట్రాల్లో ఇలాంటి వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఏపీలో మాత్రం 58 నెలలుగా ప్రజలు వాలంటీర్ల సేవలు వినియోగించుకుంటూ ఇళ్ల వద్దే గడప దాటకుండా పెన్షన్లు అందుకుంటున్నారనే విషయం తేలిపోయింది. అంటే మిగతా రాష్ట్రాలకంటే ఏపీ భిన్నంగా ఉందని అర్థమవుతోంది. ఇతర ఏ రాష్ట్రంలోనూ వృద్ధులు, వికలాంగులకు లేని సౌకర్యం సీఎం జగన్ మాత్రమే ఏపీలోని లబ్ధిదారులకు కల్పించారని రుజువైంది.

టీడీపీకి పూర్తి డ్యామేజీ..

పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు వద్దంటూ ఈసీకి ఫిర్యాదు చేయించి విజయవంతం అయ్యామనుకున్నారు టీడీపీ నేతలు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచడమే కాకుండా, వారి ప్రాథమిక విధులనుంచి కూడా తప్పించామని సంబరపడ్డారు. అయితే ఈ వ్యవహారం కాస్తా టీడీపీకి ఉరిలా మారింది. వెంటవెంటనే జరిగిన పరిణామాలు ఆ పార్టీ ఇమేజ్ ని పూర్తిగా డ్యామేజీ చేశాయి.

రెండు వర్గాలు పూర్తిగా దూరం..

నిన్న మొన్నటి వరకు వాలంటీర్లలో కొంతమంది అయినా టీడీపీ సానుభూతిపరులు ఉండేవారు. కానీ వారిపై ఆ పార్టీ కక్షగట్టిందని తేలిపోవడంతో అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు, జగన్ కి జై కొడుతున్నారు, వైసీపీ విజయానికి వారంతా నడుంకట్టారు. ఇక పెన్షన్లు అందుకుంటున్నవారంతా తమను అవస్థలు పెడుతున్నారని చంద్రబాబుపై కోపం పెంచుకుంటున్నారు. ఇది ఈనెలతోపోయేది కాదు, వరుసగా మూడు నెలలు లబ్ధిదారులు సచివాలయాలకు వచ్చి పెన్షన్లు అందుకోవాలి. టీడీపీపై ఉన్నకోపం రేపు ఎన్నికల్లో ప్రతిబింబిస్తే కూటమి నేతలకు సీట్లు గల్లంతవుతాయి. ఇక పెన్షన్లపై వేసిన పిల్ విషయంలో తాజా హైకోర్టు వ్యాఖ్యలతో సీఎం జగన్ కి మరింత మైలేజీ పెరిగినట్టయింది.

First Published:  4 April 2024 1:48 AM GMT
Next Story