Telugu Global
Andhra Pradesh

పవన్ ని సీఎం చేస్తాం..! అంబటి కామెడీ

పవన్ ని ఏకంగా సీఎం చేద్దామని అంబటి అంటుండేసరికి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు.

పవన్ ని సీఎం చేస్తాం..! అంబటి కామెడీ
X

21 సీట్లలో పోటీ చేస్తున్న జనసేన ఎన్ని చోట్ల గెలుస్తుంది..? చెప్పలేం. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కాగలరా..? కాదు, కుదరదు అనేదే దీనికి సమాధానం. కానీ జనసేన స్టార్ క్యాంపెయినర్, క్రికెటర్ అంబటి రాయుడు మాత్రం పవన్ ని సీఎం చేసుకుందామంటూ జనసైనికులకు పిలుపునిచ్చారు. 'పవన్ అన్నను సీఎం చేయడానికి సిద్ధం.. కలిసి సాధిద్దాం' అంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్టింగ్ కి ఓ రేంజ్ లో కౌంటర్లు మొదలయ్యాయి. అంబటి ఇంకా ఎదగాలంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు.


ఓవైపు సామాన్యులే తన స్టార్ క్యాంపెయినర్లంటూ సీఎం జగన్ దూసుకెళ్తున్నారు. మరోవైపు జబర్దస్త్ నటుల్ని, కామెడీ, డ్యాన్స్ షో లకు జడ్జిలుగా ఉండేవాళ్లని, ఫేడవుట్ అయిపోయిన సీరియల్ నటుల్ని.. ఏరికోరి స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించారు పవన్ కల్యాణ్. అందులో క్రికెటర్ అంబటి రాయుడికి కూడా చోటిచ్చారు. అసలు స్టార్ క్యాంపెయినర్ అనే పదవి ఎందుకిచ్చారు..? ఏంచేయాలి అనే విషయం అయినా అంబటికి తెలుసా..? అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పవన్ ని ఏకంగా సీఎం చేద్దామని అంబటి అంటుండేసరికి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు.

అంబటి రాయుడు ఆమధ్య వైసీపీకోసం జనాల్లో తిరిగారు, హడావిడి చేశారు, జగన్ ని కలసి కండువా కప్పుకున్నారు, వైసీపీ తరపున సీటు లేదని తేలిపోయేసరికి ప్లేటు ఫిరాయించారు, జనసేనలో చేరి కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. తిరిగి ఇప్పుడు జనసేన స్టార్ క్యాంపెయినర్ గా వార్తల్లోకి వచ్చారు. వస్తూ వస్తూనే పవన్ సీఎం అంటూ మంచి కామెడీ పంచారు అంబటి. మిగతా స్టార్ క్యాంపెయినర్లంతా జనసేన తరపున ఇంకెంతగా ఎంటర్టైన్ చేస్తారో చూడాలి.

First Published:  11 April 2024 12:18 AM GMT
Next Story