Telugu Global
Andhra Pradesh

బాబుకి బెయిలు లేదు, రిమాండు లేదు.. స్కిల్ కేసులో ఏసీబీ కోర్టు తీర్పు

సోమవారం శుభవార్త వినాలని ఎదురు చూసిన టీడీపీ నేతలకు వరుసగా కోర్టుల్లో షాకులు తగులుతున్నాయి. ఏసీబీ కోర్టులో స్కిల్ కేసులో చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్ కూడా రద్దయింది.

బాబుకి బెయిలు లేదు, రిమాండు లేదు.. స్కిల్ కేసులో ఏసీబీ కోర్టు తీర్పు
X

ఉదయాన్నే ఏపీ హైకోర్టులో చంద్రబాబుకి తగిలిన షాక్, ఏసీబీ కోర్టులో కూడా కంటిన్యూ అయింది. హైకోర్టులో మూడు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ కాగా.. ఏసీబీ కోర్టులో స్కిల్ కేసులో వేసిన బెయిల్ పిటిషన్ కూడా రద్దయింది. అంటే మొత్తంగా చంద్రబాబు బెయిల్ కోసం వేసిన పిటిషన్లలో ఒక్కదానికి కూడా పాజిటివ్ రిజల్ట్ రాలేదు. అన్నిచోట్లా ఆయనకు చుక్కెదురైంది. స్కిల్ కేసులో ఏసీబీ కోర్టు.. బెయిల్ పిటిషన్ పై ఇదివరకే వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. కాసేపటి క్రితం బెయిల్ పిటిషన్ కొట్టేస్తున్నట్టు నిర్ణయం వెలువరించింది.

అదొక్కటే ఊరట..

చంద్రబాబుని కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ ని కూడా ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఇదొక్కటే చంద్రబాబుకి కాస్త ఊరట. కస్టడీ పిటిషన్ ని ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకుని ఉంటే బాబు మళ్లీ విచారణకోసం సీఐడీ అధికారుల ఎదుట హాజరవ్వాల్సి ఉండేది. కానీ కస్టడీ అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. అదే సమయంలో ఆయనకు బెయిలివ్వకుండా పిటిషన్ డిస్మిస్ చేసింది.

క్వాష్ పై ఉత్కంఠ..

సోమవారం శుభవార్త వినాలని ఎదురు చూసిన టీడీపీ నేతలకు వరుసగా కోర్టుల్లో షాకులు తగులుతున్నాయి. ప్రస్తుతం అందరి చూపూ సుప్రీంకోర్టువైపే ఉంది. సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి. ఈ పిటిషన్ లో అయినా చంద్రబాబు ఊరట చెందేలా కోర్టు తీర్పు వస్తుందేమో చూడాలి.

First Published:  9 Oct 2023 10:44 AM GMT
Next Story