Telugu Global
NEWS

అమర్‌నాథ్ విషాదం.. ఇద్దరు ఏపీ మహిళలు మృతి..

అమర్‌నాథ్ యాత్రలో ఆక‌స్మిక‌ వరదలు భక్తుల ప్రాణాలు తీశాయి. ఇప్పటి వరకూ మొత్తం 18మంది మృతి చెందినట్టు అధికారిక సమాచారం. వీరిలో ఇద్దరు మహిళలు ఏపీకి చెందినవారిగా గుర్తించారు. ఈ నెల 8న అమర్‌నాథ్‌ గుహ వద్ద సంభవించిన ఆక్మసిక వరదల్లో చిక్కుకొని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సుధ, పార్వతి అనే ఇద్ద‌రు మహిళలు మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈరోజు శ్రీనగర్‌ ఆస్పత్రిలో రాజమండ్రికి చెందిన గుడిమెట్ల సుధ మృతదేహాన్ని ఆమె భర్త విజయ్‌ కిరణ్‌ […]

అమర్‌నాథ్ విషాదం.. ఇద్దరు ఏపీ మహిళలు మృతి..
X

అమర్‌నాథ్ యాత్రలో ఆక‌స్మిక‌ వరదలు భక్తుల ప్రాణాలు తీశాయి. ఇప్పటి వరకూ మొత్తం 18మంది మృతి చెందినట్టు అధికారిక సమాచారం. వీరిలో ఇద్దరు మహిళలు ఏపీకి చెందినవారిగా గుర్తించారు.

ఈ నెల 8న అమర్‌నాథ్‌ గుహ వద్ద సంభవించిన ఆక్మసిక వరదల్లో చిక్కుకొని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సుధ, పార్వతి అనే ఇద్ద‌రు మహిళలు మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.

ఈరోజు శ్రీనగర్‌ ఆస్పత్రిలో రాజమండ్రికి చెందిన గుడిమెట్ల సుధ మృతదేహాన్ని ఆమె భర్త విజయ్‌ కిరణ్‌ గుర్తించారు. పార్వతి మృతదేహాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో గుర్తించిన‌ సహచరులు.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

వీరిద్దరి భౌతిక కాయాలను స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలతో ఏపీ భవన్‌ కమిషనర్‌ కౌశిక్‌ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి మొత్తం 92మంది అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారు. వీరిలో 37మంది వరదల్లో చిక్కుకున్నారు. వరద ప్రభావానికి ఇబ్బందిపడ్డవారిలో 24 మంది సురక్షితంగా స్వస్థలాలకు పయనమయ్యారు. మరో 11 మంది ఏపీ అధికారులతో టచ్‌లో ఉన్నారు.

ఇక మిగిలిన ఇద్దరు మృతి చెందారు. ఆదివారం ఆల్రడీ ఓ బృందం క్షేమంగా చండీగఢ్ నుంచి విజయవాడకు రైలులో వచ్చింది. మరో బృందం ఈరోజు రైలులో బయలుదేరింది. ఇక అక్కడ వరదల్లో చిక్కుకుపోయిన వారి ఆచూకీ కోసం ఇక్కడ బంధువులు ఆందోళన చెందుతున్నారు.

కొంతమంది ఫోన్లు సిగ్నల్స్ లేక, చార్జింగ్ లేక సమాచారం తెలియడంలేదు. ఈరోజు వారిలో కొంతమంది బంధువులతో మాట్లాడారు. 11మంది ఏపీ అధికారులతో కూడా టచ్ లో ఉన్నారు.

18మంది మృత్యువాత..

అమర్‌నాథ్ యాత్రలో వరదల కారణంగా ఒక్కసారిగా అలజడి రేగింది. యాత్రికుల గుడారాలు సైతం వరదల నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వరద బీభ‌త్సానికి అదే రోజు 14మంది మృతిచెందారు. ఆ తర్వాత మరో నలుగురు మృత్యువాత పడినట్టు అధికారులు గుర్తించారు.

మొత్తంగా 18మంది మృతి చెందారు. రెస్క్యూ టీంకు లభించిన మృతదేహాలను శ్రీనగర్‌ కు తరలించిన అధికారులు. తీవ్రంగా గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రితో పాటు ఢిల్లీ ఎయిమ్స్‌ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

రెండేళ్లు కరోనా కారణంగా అమర్‌నాథ్ యాత్రకు ఆంటంకం ఏర్పడింది. ఈ ఏడాది అన్ని జాగ్రత్తలు తీసుకుని యాత్రకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఉగ్రదాడులు ఉంటాయేమోనన్న అనుమానాలతో భద్రత కట్టుదిట్టం చేసింది. అయితే ప్రకృతి విపత్తు భక్తుల ప్రాణాలు బలిగొంది.

First Published:  11 July 2022 4:23 AM GMT
Next Story