Telugu Global
MOVIE UPDATES

రంగమార్తాండ టైటిల్ లోగో లాంచ్

లాంగ్ గ్యాప్ తర్వాత కృష్ణవంశీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇంటెన్స్ ఎమోషనల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ దర్శకుడు, తన కెరీర్ లో తొలిసారి ఓ రీమేక్ ప్రాజెక్టు హ్యాండిల్ చేస్తున్నారు. ఆ సినిమా పేరు రంగమార్తాండ. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఇళయరాజా సంగీతం సారధ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రంగమార్తాండ. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, […]

రంగమార్తాండ టైటిల్ లోగో లాంచ్
X

లాంగ్ గ్యాప్ తర్వాత కృష్ణవంశీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇంటెన్స్ ఎమోషనల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ దర్శకుడు, తన కెరీర్ లో తొలిసారి ఓ రీమేక్ ప్రాజెక్టు హ్యాండిల్ చేస్తున్నారు. ఆ సినిమా పేరు రంగమార్తాండ.

హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఇళయరాజా సంగీతం సారధ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రంగమార్తాండ. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్స్ బాలకృష్ణ, అలీ రేజా, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, తదితరులు నటించిన ఈ చిత్ర టైటిల్ లోగోను యూనిట్ సభ్యులు విడుదల చేశారు.

రంగమార్తాండ సినిమా టీజర్, ట్రైలర్ త్వరలో విడుదల కానున్నాయి. ఆగస్ట్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మన అమ్మానాన్నల కథ గా రంగమార్తాండ థియేటర్స్ కు రానుంది, ఫ్యామిలీ ఎమోషన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా ఉండనుంది.

మరాఠీలో పెద్ద హిట్టయిన నటసామ్రాట్ సినిమాకు రీమేక్ గా ఈ మూవీ వస్తోంది. అక్కడ నానా పటేకర్ నటించాడు. ఏకంగా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. ఇప్పుడు ఆ పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. తెలుగు వెర్షన్ కు సంబంధించి కృష్ణవంశీ పెద్దగా మార్పుచేర్పులు చేయలేదు.

First Published:  9 July 2022 7:42 AM GMT
Next Story