Telugu Global
NEWS

సర్కారు బడిలో చేరిన ఐఏఎస్ పిల్లలు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ విద్యావ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘నాడు -నేడు’ కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మార్చారు. అంతేకాక ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా ఇంగ్లిష్ మాధ్యమాన్ని తీసుకొచ్చారు. దీంతో సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల కోసం అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, గోరుముద్ద లాంటి అనేక పథకాలు అమలు చేస్తున్నారు. సీఎం జగన్ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్య అందుతుండటంతో అంతా సంతోషిస్తున్నారు. […]

సర్కారు బడిలో చేరిన ఐఏఎస్ పిల్లలు..!
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ విద్యావ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘నాడు -నేడు’ కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మార్చారు. అంతేకాక ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా ఇంగ్లిష్ మాధ్యమాన్ని తీసుకొచ్చారు. దీంతో సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల కోసం అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, గోరుముద్ద లాంటి అనేక పథకాలు అమలు చేస్తున్నారు. సీఎం జగన్ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్య అందుతుండటంతో అంతా సంతోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఐఏఎస్ అధికారి తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. శాప్‌ ఎండీ ప్రభాకర్‌ రెడ్డి తన ఇద్దరు పిల్లలను విజయవాడలోని పడమట జిల్లా పరిషత్‌ పాఠశాలలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడం వల్ల తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్‌ చేశామని ప్రభాకర్‌రెడ్డి సతీమణి లక్ష్మీ పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. స్కూల్‌లో వసతులు, క్లాస్‌రూమ్‌లు, ప్లే గ్రౌండ్‌ అన్నీ చాలా బాగున్నాయన్నారు. గతంలో నెల్లూరు జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో కూడా వాళ్ల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించారు. కాగా వేసవి సెలవుల అనంతరం ఏపీలో పాఠశాలలు మంగళవారం నుంచి పునః ప్రారంభమయ్యాయి. విజయవాడలో పడమట పాఠశాలలో గతేడాది నాలుగు వందల మందికి పైగా కొత్తగా విద్యార్థులు చేరగా.. ఈ ఏడాది కూడా దాదాపు 500 వందల మంది కొత్తగా చేరనున్నట్లు ఉపాధ్యాయులు అంచనా వేస్తున్నారు.

First Published:  5 July 2022 6:58 AM GMT
Next Story