Telugu Global
MOVIE UPDATES

అల్లు అర్జున్ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా?

పుష్ప-2 సినిమా కథ ఇంకా కొలిక్కిరాలేదు. ఈ సినిమాలోకి ఓ బాలీవుడ్ బ్యూటీ రాబోతోంది. పుష్ప-2 సెట్స్ పైకి వచ్చేది అప్పుడే. ఇలా ఈ సినిమాపై ఎప్పటికప్పుడు వార్తలు-విశ్లేషణలు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఓకే కానీ, పుష్ప కథానాయకుడు అల్లు అర్జున్ ఇప్పుడెక్కడున్నాడో తెలుసా? సుకుమార్ తో కలిసి అతడు కథా చర్చల్లో ఉన్నాడనుకుంటే పొరపాటే. ప్రస్తుతం అతడు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉన్నాడు. బన్నీ, తన కుటుంబంతో కలిసి టాంజానియా వెళ్లాడు. భార్య స్నేహ, […]

అల్లు అర్జున్ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా?
X

పుష్ప-2 సినిమా కథ ఇంకా కొలిక్కిరాలేదు. ఈ సినిమాలోకి ఓ బాలీవుడ్ బ్యూటీ రాబోతోంది. పుష్ప-2 సెట్స్ పైకి వచ్చేది అప్పుడే. ఇలా ఈ సినిమాపై ఎప్పటికప్పుడు వార్తలు-విశ్లేషణలు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఓకే కానీ, పుష్ప కథానాయకుడు అల్లు అర్జున్ ఇప్పుడెక్కడున్నాడో తెలుసా? సుకుమార్ తో కలిసి అతడు కథా చర్చల్లో ఉన్నాడనుకుంటే పొరపాటే. ప్రస్తుతం అతడు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉన్నాడు.

బన్నీ, తన కుటుంబంతో కలిసి టాంజానియా వెళ్లాడు. భార్య స్నేహ, కొడుకు అయాన్, కూతురు అర్హతో కలిసి టాంజానియా నేషనల్ పార్క్ లో చక్కర్లు కొడుతున్నాడు. స్నేహా రెడ్డి తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని బయట పెట్టేంత వరకు బన్నీ అక్కడున్నాడనే విషయం ఎవ్వరికీ తెలియదు.

కుటుంబం అంతా వైట్ అండ్ వైట్ తో టాంజానియా నేషనల్ పార్క్ లో చక్కర్లు కొడుతున్నారు. అక్కడున్న వన్య ప్రాణుల్ని పిల్లలకు చూపిస్తున్నారు. మరికొన్నాళ్లు ఆఫ్రికా టూర్ లోనే ఉండబోతోంది ఈ కుటుంబం. ఈ నెలాఖరుక టూర్ ముగించుకొని ఇండియాకు వస్తుంది.

అన్నట్టు పుష్ప-2 సెట్స్ పైకి రావడం ఆలస్యం అవ్వడంతో, బన్నీ తన గడ్డాన్ని కాస్త ట్రిమ్ చేశాడు. గుబురు గడ్డాన్ని దాదాపు సగానికి పైగా కట్ చేశాడు. అయితే హెయిర్ స్టయిల్ మాత్రం మార్చలేదు. ఆగస్ట్ నుంచి పుష్ప-2 సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.

First Published:  4 July 2022 9:01 PM GMT
Next Story