Telugu Global
MOVIE UPDATES

పుష్ప-2 స్టోరీ.. ఇంకా సాగుతూనే ఉంది

పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్టయింది పుష్ప సినిమా. బన్నీకి నార్త్ లో ఎక్కడలేని క్రేజ్ తీసుకొచ్చింది. దీంతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడా ఇమేజ్ ను అలానే కొనసాగించాలంటే పుష్ప-2 కచ్చితంగా హిట్టవ్వాలి. అందుకే యూనిట్ అంతా కథపై కిందామీద పడుతోంది. ప్రతి రోజూ చర్చలు జరుపుతూనే ఉంది. అయినప్పటికీ ఇంకా పుష్ప-2 కథ కొలిక్కి రాలేదు. సుకుమార్ దగ్గర రైటర్స్ టీమ్ ఉంది. రెగ్యులర్ గా తన సినిమా కథాచర్చల్ని వాళ్లతోనే […]

pushpa movie allu arjun
X

పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్టయింది పుష్ప సినిమా. బన్నీకి నార్త్ లో ఎక్కడలేని క్రేజ్ తీసుకొచ్చింది. దీంతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడా ఇమేజ్ ను అలానే కొనసాగించాలంటే పుష్ప-2 కచ్చితంగా హిట్టవ్వాలి. అందుకే యూనిట్ అంతా కథపై కిందామీద పడుతోంది. ప్రతి రోజూ చర్చలు జరుపుతూనే ఉంది. అయినప్పటికీ ఇంకా పుష్ప-2 కథ కొలిక్కి రాలేదు.

సుకుమార్ దగ్గర రైటర్స్ టీమ్ ఉంది. రెగ్యులర్ గా తన సినిమా కథాచర్చల్ని వాళ్లతోనే జరుపుతాడు సుకుమార్. ఈసారి వాళ్లతో పాటు మరింత మందిని తీసుకున్నాడట. అందరూ చెబుతున్న వెర్షన్స్ ను రికార్డ్ చేస్తున్నాడు. వాటిలోంచి మంచి పాయింట్స్ ను రాసుకుంటున్నాడు. అలా పుష్ప పార్ట్-2 కథపై వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి.

లెక్కప్రకారం ఈ సినిమా ఈనెలలోనే సెట్స్ పైకి రావాలి. కానీ సుకుమార్ చెప్పిన రఫ్ వెర్షన్ ను హీరో అల్లు అర్జున్ అంగీకరించలేదు. చాలా సన్నివేశాలు, ట్విస్టులు పాన్ ఇండియా స్థాయిలో లేవని తిప్పికొట్టాడు. అవసరమైతే మరింత టైమ్ తీసుకొని, పక్కా కథ-స్క్రీన్ ప్లేతో రావాలని సూచించాడు. దీంతో సుకుమార్ మళ్లీ కథా చర్చలు మొదలుపెట్టాడు.

సుకుమార్ రైటర్స్ టీమ్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. పుష్ప-2కు సంబంధించి ఫస్టాఫ్ పూర్తయింది. సెకండాఫ్ పై మల్లగుల్లాలు పడుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ అంతుచిక్కకుండా ఉందంట. క్లయిమాక్స్ మాత్రం లాక్ అయినట్టు సమాచారం.

First Published:  4 July 2022 12:50 PM GMT
Next Story