Telugu Global
National

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ లో ఆంధ్రప్రదేశ్ మరోసారి నంబర్‌ వన్‌గా నిలిచింది. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020 ర్యాంకులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. ఏపీ ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంది. 97.89 శాతం స్కోర్ తో ఏపీ మొదటి స్థానంలో ఉండగా.. 97.77 శాతం స్కోర్ తో గుజరాత్ రెండో స్థానంలో ఉంది. మూడో ప్లేస్ లో ఉన్న తమిళనాడు స్కోర్ 96.97 కాగా, […]

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్
X

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ లో ఆంధ్రప్రదేశ్ మరోసారి నంబర్‌ వన్‌గా నిలిచింది. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020 ర్యాంకులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు.

ఏపీ ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంది. 97.89 శాతం స్కోర్ తో ఏపీ మొదటి స్థానంలో ఉండగా.. 97.77 శాతం స్కోర్ తో గుజరాత్ రెండో స్థానంలో ఉంది. మూడో ప్లేస్ లో ఉన్న తమిళనాడు స్కోర్ 96.97 కాగా, తెలంగాణ నాలుగో స్థానంలో 94.86 శాతం స్కోర్ సాధించింది.

టాప్ అచీవర్స్ లిస్ట్ లో ఏపీ, గుజరాత్, హర్యానా, కర్నాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. టాప్ లిస్ట్ లో ఉన్న 7 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు 3 మాత్రమే. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తమ సత్తా చాటడం విశేషం.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల విషయంలో రాష్ట్రాలను 4 కేటగిరీలుగా విభజించింది కేంద్రం. గతంలో నేరుగా గణాంకాలను చూసి ర్యాంకులను ప్రకటిస్తుండగా.. ఇప్పుడు మాత్రం పెట్టుబడి దారులనుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటోంది. 10,200 మంది పెట్టుబడిదారులు, స్టాక్‌ హోల్డర్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన కేంద్రం ఈ ర్యాంకులను ప్రకటించింది.

మొత్తం 4 క్యాటగిరీల్లో రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది కేంద్రం. తొలి జాబితాలో టాప్-7 రాష్ట్రాలను చేర్చింది. ఏపీ, తెలంగాణ ఈ జాబితాలో ఉన్నాయి. ఇక రెండో జాబితాలో హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు 80-90 శాతం స్కోర్‌ తో ఉన్నాయి. అసోం, ఛత్తీస్‌ గఢ్, గోవా, జార్ఖండ్, కేరళ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మూడో కేటగిరీ కిందకు వచ్చాయి. వాటి స్కోరు 50నుంచి 80శాతం మధ్యలో ఉంది. ఇక ఢిల్లీ, బీహార్ సహా కేంద్ర పాలిత ప్రాంతాలు 50 శాతం కంటే తక్కువ స్కోర్ చేశాయి. నాలుగో కేటగిరీలో ఉన్నాయి.

First Published:  30 Jun 2022 8:26 AM GMT
Next Story