Telugu Global
National

బ్యాంకులను రూ. 34,615 కోట్లకు ముంచిన డీహెచ్ఎఫ్ఎల్ నుంచి బీజేపీకి రూ. 28 కోట్ల విరాళాలు

రాజకీయ పార్టీలకు పలు కార్పొరేట్లు, ఇండ‌స్ట్రీలిస్టులు, బిలియనీర్ల నుంచి విరాళాలు అందడం సాధారణమే. అయితే దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ స్కాం చేసిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి భారీగా విరాళాలు ఇవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ పలు బ్యాంకుల నుంచి రూ. 34,615 కోట్ల అప్పులు తీసుకొని ఎగ్గొట్టినట్లు తెలుస్తుంది. ఇది దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ స్కాం. అయితే ఇలాంటి కంపెనీ 2014 […]

బ్యాంకులను రూ. 34,615 కోట్లకు ముంచిన డీహెచ్ఎఫ్ఎల్ నుంచి బీజేపీకి రూ. 28 కోట్ల విరాళాలు
X

రాజకీయ పార్టీలకు పలు కార్పొరేట్లు, ఇండ‌స్ట్రీలిస్టులు, బిలియనీర్ల నుంచి విరాళాలు అందడం సాధారణమే. అయితే దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ స్కాం చేసిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి భారీగా విరాళాలు ఇవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ పలు బ్యాంకుల నుంచి రూ. 34,615 కోట్ల అప్పులు తీసుకొని ఎగ్గొట్టినట్లు తెలుస్తుంది. ఇది దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ స్కాం. అయితే ఇలాంటి కంపెనీ 2014 నుంచి 2015 మధ్యకాలంలో దాదాపు రూ. 28 కోట్ల విరాళాలను భారతీయ జనతా పార్టీకి ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ప్రతీ పార్టీ తమకు వచ్చిన వివరాలను వెల్లడించాలి. బీజేపీ కూడా తమకు అందిన వివరాలు తెలియజేసిన సమయంలో డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లకు చెందిన కంపెనీల నుంచి వచ్చిన సొమ్మును కూడా తెలిపింది. కానీ సదరు కంపెనీలు మాత్రం తమ బ్యాలెన్స్ షీట్లలో మాత్రం సదరు మొత్తాన్ని చూపించకపోవడం గమనార్హం. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్ లిమిటెడ్ నుంచి రూ. 10 కోట్లు వచ్చినట్లు బీజేపీ తెలిపింది. ఇది డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లకు చెందిన కంపెనీనే. అలాగే వధవాన్ గ్లోబల్ కేపిటల్ లిమిటెడ్ కంపెనీ మరో రూ. 10 కోట్లు బీజేపీకి ఇచ్చింది. ఈ కంపెనీ డైరెక్టర్లుగా డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లైన కపిల్ వధవాన్, ధీరజ్ వధవాన్‌లు ఉన్నారు.

ఇక 2019లో బీజేపీకి దర్శన్ డెవలపర్స్ నుంచి రూ. 7.5 కోట్ల విరాళం అందింది. ఈ కంపెనీ వధవాన్ ఫ్యామిలీకి చెందినదే. ఇలా పలుమార్లు డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లకు చెందిన కంపెనీల నుంచి బీజేపీకి భారీ మొత్తంలో విరాళాలు అందాయి. అయితే 2019లో కోబ్రాపోస్ట్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో డీహెచ్ఎఫ్ఎల్ స్కామ్ బయటకు వచ్చింది. 2010 నుంచి 2018 మధ్య డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ 17 అసోసియేషన్ బ్యాంకుల నుంచి రూ. 42,871 కోట్లు రుణాలు తీసుకున్నది. ఈ విషయాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ధృవీకరించింది.

2019 నుంచి డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ సక్రమంగా రుణాలను చెల్లించలేదు. ఈ రుణాలను దుర్వినియోగం చేయడమే కాకుండా, డీహెచ్ఎఫ్ఎల్ ఖాతా పుస్తకాల నుంచి వాటికి సంబంధించిన వివరాలను మార్చేసినట్లు తెలిసింది. ఇలా రుణాలు చెల్లించక పోవడంతో డీహెచ్ఎఫ్ఎల్ వల్ల 17 బ్యాంకులకు రూ. 34,615 కోట్ల నష్టం ఏర్పడింది. రుణాలు చెల్లించకపోయినా.. అదే సమయంలో బీజేపీకి మాత్రం భారీగా విరాళాలు ఇచ్చింది. బ్యాంక్ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న కపిల్ వధవాన్ 2019లో రూ. 10 కోట్లు బీజేపీ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయడం గమనార్హం. డీహెచ్ఎఫ్ఎల్ బ్యాంకు రుణాల ఎగవేతకు, బీజేపీకి ఇచ్చిన విరాళాలకు కచ్చితంగా సంబంధం ఉంటుందని.. దీనిపై విచారణ చేయాలని తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిషాంక్ ప్రశ్నించారు.

First Published:  26 Jun 2022 1:33 AM GMT
Next Story