Telugu Global
National

ఏక్ నాథ్ షిండేకి బీజేపీ డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ ?

మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న శివసేన నేత ఏక్ నాథ్ షిండేకి బీజేపీ ఉప ముఖ్యమంత్రి పదవినివ్వజూపుతోందని తెలుస్తోంది. 2019 లో ఎన్సీపీ నేత అజిత్ పవార్ కి కూడా ఇలాంటి ఆఫరే లభించింది. ప్రభుత్వంలో షిండే, ఆయన సహచర ఎమ్మెల్యేలు మార్పును తెచ్చిన పక్షంలో ఈ పదవి మీకే అని షిండేకి ఇవ్వజూపినట్టు సీనియర్ పార్టీ నేత ఒకరు తెలిపారు. 2019 లో మాదిరే ఈ సారి కూడా మంత్రిపదవులు ఉంటాయని ఆయన చెప్పారు. నాటి […]

ఏక్ నాథ్ షిండేకి బీజేపీ డిప్యూటీ సీఎం
X

మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న శివసేన నేత ఏక్ నాథ్ షిండేకి బీజేపీ ఉప ముఖ్యమంత్రి పదవినివ్వజూపుతోందని తెలుస్తోంది. 2019 లో ఎన్సీపీ నేత అజిత్ పవార్ కి కూడా ఇలాంటి ఆఫరే లభించింది. ప్రభుత్వంలో షిండే, ఆయన సహచర ఎమ్మెల్యేలు మార్పును తెచ్చిన పక్షంలో ఈ పదవి మీకే అని షిండేకి ఇవ్వజూపినట్టు సీనియర్ పార్టీ నేత ఒకరు తెలిపారు. 2019 లో మాదిరే ఈ సారి కూడా మంత్రిపదవులు ఉంటాయని ఆయన చెప్పారు. నాటి ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాని పరిస్థితుల్లో..

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అప్పటి ఎన్సీపీ రెబెల్ అజిత్ పవార్ తో మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చేతులు కలపడానికి యత్నించారని, చివరకు అప్పుడు 80 గంటలపాటు మాత్రం ప్రభుత్వం అధికారంలో కొనసాగిందని ఆయన గుర్తు చేశారు. 2019 లో పవార్ ఎలా తిరుగుబాటు చేశారో ఇప్పుడు షిండే తిరుగుబాటు కూడా అలాగే ఉందని, నాడు పవార్ కి ఉపముఖ్యమంత్రి పదవి లభించగా, ఆయన సహచరులకు మంత్రివర్గంలో ప్రాధాన్యతనిస్తామని హామీ ఇచ్చారని ఆయన అన్నారు.

ఏక్ నాథ్ షిండే వర్గం తమకు గరిష్టంగా 12 మంత్రిపదవులు లభించవచ్చునని ఆశిస్తున్నదని, 2019 వరకు ఫడ్నవీస్ ప్రభుత్వ హయాంలో శివసేన వర్గానికి కూడా ఇలాగే జరిగిందని పేర్కొన్నారు. నాడు దిగువ సభలో సేనకు 63 మంది సభ్యులున్నారని, అప్పుడు ఆ పార్టీకి కేవలం 5 కేబినెట్ బెర్తులు మాత్రమే కేటాయించారని, సుదీర్ఘ సంప్రదింపుల తరువాత ఆ పార్టీకి ఏడు సహాయ మంత్రి పదవులు లభించాయని ఆ నేత అన్నారు. షిండే గ్రూపులో 45 మంది సభ్యులకన్నా ఎక్కువమంది ఉండకపోవచ్చు..

అందువల్ల 2014 లో సేనకు లభించినదానికన్నా ఎక్కువగా బెర్తులు లభించకపోవచ్చు అని ఈ బీజేపీ నేత అభిప్రాయపడ్డారు. 2019 లో అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం తరువాత ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని ఎదుర్కొనేందుకు తగినంతమంది సభ్యులను కూడగట్టుకోలేకపోయారు.. దాంతో ఆయన మళ్ళీ పార్టీ గూటికి చేరక తప్పలేదు. కాగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే షిండే వర్గం రెండు, మూడు మినహా కీలకమైన శాఖలను దక్కించుకోలేకపోవచ్చు.

గతంలో మాదిరే ఈసారి కూడా బీజేపీ ..వారి కోర్కెలకు తగ్గకుండా తనదే పైచేయిఅన్న విధంగా వ్యవహరించవచ్చు అని మరో నేత పేర్కొన్నారు. 43 మంది సభ్యులతో కూడిన కేబినెట్ లో ఈ వర్గానికి 25 శాతానికి మించి షేర్ దక్కే అవకాశాలు లేవని ఆయన అన్నారు. షిండేతోబాటు సుమారు 10 మంది ఎమ్మెల్యేలకు కేబినెట్ లో స్థానం లభించవచ్చునని సేనకు చెందిన ఓ నాయకుడొకరు చెప్పారు. ఇక అసెంబ్లీలో 106 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉండగా వీరిలో చాలామంది.. రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంత్రిపదవులు ఆశిస్తున్నారు. లాబీయింగ్ అప్పుడే ప్రారంభమయింది. పలువురు నేతలు ఫడ్నవీస్ ఇంటికి చేరుకొని వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు.

First Published:  23 Jun 2022 4:32 AM GMT
Next Story