Telugu Global
NEWS

‘ఏపీలో ఖజానా ఖాళీ… నిధులు విదేశాలకు తరలిస్తున్నారా ?’

ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి పాలన అప్పులు, అవినీతిలో మునిగితేలుతోందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ సహాయమంత్రి శోభా కరంద్లాజే ద్వజమెత్తారు. అనంతపురంలో నిన్న జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్ర ఖజానాలో ఒక్క పైసా కూడా లేదని , రాబడి మొత్తం ఏమవుతోందని ప్రశ్నించిన కేంద్ర మంత్రి. నిధులను విదేశాలకు తరలిస్తున్నట్టు అనుమానం కలుగుతోందన్నారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి ప్రభుత్వం చేరుకుందని తీవ్ర విమర్శలు చేసిన శోభా […]

shobha-karandlaje
X

ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి పాలన అప్పులు, అవినీతిలో మునిగితేలుతోందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ సహాయమంత్రి శోభా కరంద్లాజే ద్వజమెత్తారు. అనంతపురంలో నిన్న జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్ర ఖజానాలో ఒక్క పైసా కూడా లేదని , రాబడి మొత్తం ఏమవుతోందని ప్రశ్నించిన కేంద్ర మంత్రి. నిధులను విదేశాలకు తరలిస్తున్నట్టు అనుమానం కలుగుతోందన్నారు.

ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి ప్రభుత్వం చేరుకుందని తీవ్ర విమర్శలు చేసిన శోభా కరంద్లాజే ఈ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క కళాశాల అయినా కట్టారా? ఒక్క రోడ్డైనా వేశారా? అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే తప్ప ఏపీ అభివృద్ది సాధ్యం కాదని ఆమె అన్నారు. ఏపీకి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తోందని, దేశవ్యాప్తంగా ఆరు ఎయిమ్స్‌లు ఏర్పాటు చేస్తే అందులో ఒకటి మంగళగిరిలో ఉందని, దానిని వచ్చే నెల 4న ప్రధాని మోదీ ప్రారంభిస్తారని శోభ తెలిపారు.

First Published:  15 Jun 2022 9:49 PM GMT
Next Story