Telugu Global
MOVIE UPDATES

రంగమార్తాండ మూవీ అప్ డేట్స్

లాంగ్ గ్యాప్ తర్వాత కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న సినిమా రంగమార్తాండ. చాన్నాళ్లుగా ఇదే సినిమా పనిపై ఉన్నాడు ఈ దర్శకుడు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా కీలకమైన రీ-రికార్డింగ్ వర్క్ మొదలైంది. ప్రస్తుతం దర్శకుడు కృష్ణవంశీ, సంగీత దర్శకుడు ఇళయరాజా తో నేపధ్య సంగీతం చేయించుకుంటున్నారు. ఫస్ట్ టైమ్ కృష్ణవంశీ మ్యూజిక్ సిట్టింగ్స్ వీడియోస్ ను తన సోషల్ మీడియాలో […]

Ranga marthanda 3
X

లాంగ్ గ్యాప్ తర్వాత కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న సినిమా రంగమార్తాండ. చాన్నాళ్లుగా ఇదే సినిమా పనిపై ఉన్నాడు ఈ దర్శకుడు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా కీలకమైన రీ-రికార్డింగ్ వర్క్ మొదలైంది.

ప్రస్తుతం దర్శకుడు కృష్ణవంశీ, సంగీత దర్శకుడు ఇళయరాజా తో నేపధ్య సంగీతం చేయించుకుంటున్నారు. ఫస్ట్ టైమ్ కృష్ణవంశీ మ్యూజిక్ సిట్టింగ్స్ వీడియోస్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇళయరాజాతో వర్క్ ఎక్స్ పీరియన్స్ ను షేర్ చేసుకున్నారు.

త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు. రంగమార్తాండ సినిమాలో రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, అలీ రేజా తదితరులు నటిస్తున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.

మరాఠీలో సూపర్ హిట్టయిన నటసామ్రాట్ అనే సినిమాకు రీమేక్ గా వస్తోంది రంగమార్తాండ. మరాఠీలో నానాపటేకర్ పోషించిన పాత్రను తెలుగులో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నాడు. ఈ సినిమాపై ఇటు ప్రకాష్ రాజ్, అటు కృష్ణవంశీ చాలా నమ్మకంగా ఉన్నారు. మాతృదేవోభవ టైపులో క్లాసిక్ అవుతుందని భావిస్తున్నారు.

First Published:  16 Jun 2022 10:38 AM GMT
Next Story