Telugu Global
NEWS

కోనసీమ అల్లర్ల ఎఫెక్ట్.. ఎస్పీ బదిలీ..

ఏపీలో ఐదుగురు ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోనసీమ జిల్లా ఎస్పీగా ఉన్న సుబ్బారెడ్డిని మంగళగిరిలోని ఆరో బెటాలియన్ కమాండెంట్ గా బదిలీ చేశారు. కోనసీమకు కొత్త ఎస్పీగా సిహెచ్.సుధీర్ కుమార్ రెడ్డిని నియమించారు. ఆయన ఇప్పటి వరకు కర్నూరు జిల్లా ఎస్పీగా పనిచేశారు. సుధీర్ కుమార్ రెడ్డి స్థానంలో కర్నూలు జిల్లాకు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ని కృష్ణా జిల్లా నుంచి బదిలీ చేశారు. కౌశల్ స్థానంలో కృష్ణా జిల్లాకు […]

konaseema-sp-transfer
X

ఏపీలో ఐదుగురు ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోనసీమ జిల్లా ఎస్పీగా ఉన్న సుబ్బారెడ్డిని మంగళగిరిలోని ఆరో బెటాలియన్ కమాండెంట్ గా బదిలీ చేశారు. కోనసీమకు కొత్త ఎస్పీగా సిహెచ్.సుధీర్ కుమార్ రెడ్డిని నియమించారు. ఆయన ఇప్పటి వరకు కర్నూరు జిల్లా ఎస్పీగా పనిచేశారు. సుధీర్ కుమార్ రెడ్డి స్థానంలో కర్నూలు జిల్లాకు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ని కృష్ణా జిల్లా నుంచి బదిలీ చేశారు. కౌశల్ స్థానంలో కృష్ణా జిల్లాకు ఎస్పీగా జాషువా వచ్చారు. ఆయన గతంలో విజయవాడ శాంతి భద్రతల డీసీపీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ స్థానంలో విశాల్ గున్నిని నియమించారు. విశాల్ గున్ని ఇప్పటి వరకు మంగళగిరి బెటాలియన్ కమాండెంట్ గా ఉన్నారు. మొత్తం ఐదుగురికి స్థాన చలనం జరిగింది. ఈ ఐదుగురు ఒకరి స్థానంలోకి ఇంకొకరు మారారు.

కోనసీమ ప్రభావం..

కోనసీమ జిల్లా పేరుని అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఇటీవల ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది, అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఇచ్చింది. దీంతో అక్కడ అల్లర్లు మొదలయ్యాయి. అభ్యంతరాలు వ్యక్తమవుతుండే సరికి.. కొందరు జిల్లా పేరు మార్చాల్సిందేనని పట్టుబట్టారు. మరో వర్గం మార్చకూడదంటూ ఆందోళన తెలిపింది. చివరకు ఓ మంత్రి, మరో ఎమ్మెల్యే ఇళ్లు కూడా తగలబెట్టారు ఆందోళనకారులు. ఈ ఘటన జరిగి మూడు వారాలవుతున్నా.. ఇంకా అరెస్ట్ లు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో పొలిటికల్ హీట్ కి కోనసీమ అల్లర్లు కారణం అయ్యాయి. ఈ అల్లర్లకు కారణం మీరంటే మీరంటూ అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి.

కోనసీమ అల్లర్లు ఈ స్థాయిలో జరుగుతాయని, బస్సులు తగలబెడతారని, ఏకంగా మంత్రి ఇంటికే నిప్పంటిస్తారని.. ఎవరూ ఊహించలేదు. అయితే పోలీసులు సంయమనంగా వ్యవహరించారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు. కానీ ముందుగానే ఆందోళనకారుల్ని అడ్డుకుని ఉంటే పరిస్థితి అంతదూరం వచ్చేది కాదనే వాదన కూడా ఉంది. అల్లర్లు జరిగే సమయంలో జిల్లా ఎస్పీగా ఉన్న సుబ్బారెడ్డి కఠినంగా లేరని, అందుకే పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయనే ప్రచారం జరిగింది. దీంతో ఉన్నతాధికారులు నేరుగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. ఎస్పీ సుబ్బారెడ్డి ఉన్నా కూడా.. డీఐజీ పాలరాజు అన్నీ తానై చూసుకున్నారు. అరెస్ట్ ల వ్యవహారం కూడా ఆయనే దగ్గరుండి పర్యవేక్షించారు. ఒకరకంగా సుబ్బారెడ్డిని కొన్నిరోజుల క్రితమే పక్కనపెట్టారు. ఇప్పుడు ఆయనను బదిలీ చేశారు. ఎస్పీగా ఉన్న ఆయన్ను తీసుకెళ్లి మంగళగిరి బెటాలియన్ కమాండెంట్ గా నియమించారు.

First Published:  16 Jun 2022 5:23 AM GMT
Next Story