Telugu Global
National

విపక్షాల్లో అనైక్యత.. దీదీ మీటింగ్ కి ఆప్, వైసీపీ కూడా దూరం.. !

రాష్ట్రపతి ఎన్నికకు ముందు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక కోసం బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం ఢిల్లీలో విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా ఆమె 22 రాష్ట్రాల బీజేపీయేతర సీఎంలకు లేఖలు రాశారు. ఈ మీటింగ్ లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, తెలంగాణ సీఎం కేసీఆర్.. తాము అటెండ్ అయ్యేది లేదని చెప్పేశారు. బీజేపీతో బాటు కాంగ్రెస్ […]

Mamata banerjee
X
రాష్ట్రపతి ఎన్నికకు ముందు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక కోసం బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం ఢిల్లీలో విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా ఆమె 22 రాష్ట్రాల బీజేపీయేతర సీఎంలకు లేఖలు రాశారు. ఈ మీటింగ్ లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, తెలంగాణ సీఎం కేసీఆర్.. తాము అటెండ్ అయ్యేది లేదని చెప్పేశారు. బీజేపీతో బాటు కాంగ్రెస్ పార్టీ కూడా తమకు శత్రువే గనుక ఇందులో పాల్గొనేది లేదని, తమ పార్టీ తరఫున ప్రతినిధులనెవరినీ పంపే ప్రసక్తి కూడా లేదని ఆయన నిష్కర్షగా ప్రకటించారు. మొదటి నుంచీ తాము కాంగ్రెస్ పార్టీని కూడా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందేనన్నారు. టీఆరెస్ తరఫున కొంతమంది ప్రతినిధులను ఈ సమావేశానికి పంపవచ్చునని మొదట వార్తలు వచ్చినప్పటికీ.. రాత్రి పొద్దుపోయేసరికి ట్రెండ్ మారిపోయింది.
ఇక ఏపీ సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీకి దీదీ నుంచి ఆహ్వానం అందలేదని, ఈ కారణంగా వైసీపీ నేతలు కూడా ఈ భేటీకి హాజరు కావడం లేదని తెలుస్తోంది.రాష్ట్రపతి ఎన్నికకు అభ్యర్థిని నిలబెట్టాలా.. నిలబెడితే ఎవరిని అన్నది నిర్ణయించేందుకు మమత ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని వార్తలు వచ్చినప్పటికీ .. అదేం కాదని.. ఒకరకంగా 2024 ఎన్నికల్లో బీజేపీని విపక్షాలన్నీ సమైక్యంగా ఎదుర్కొనేందుకు వ్యూహరచన చేయడానికే మమత ఈ బీజేపీయేతర సీఎంల సమావేశాన్ని ఏర్పాటు చేశారన్నది బహిరంగ రహస్యం. బహుశా అందుకే పరోక్షంగా బీజేపీపట్ల ‘సుహృద్బావ భావన’లున్న జగన్ సైతం ఈ మీటింగ్ విషయాన్ని పక్కన బెట్టినట్టు తెలుస్తోంది.
ఇక ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ మీటింగ్ కి హాజరు కావడంలేదు. తెలంగాణాలో టీఆరెస్ , ఢిల్లీలో ఆప్ పార్టీలు రెండూ అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేస్తారన్న విషయం తేలిన తరువాతే తాము స్పందిస్తామని ఆప్ వర్గాలు స్పష్టం చేశాయి. కేసీఆర్ మాదిరే కేజ్రీవాల్ కూడా ముందుముందు దేశ రాజకీయాల్లో తామే క్రియాశీలక పాత్ర వహించాలని భావిస్తున్నారు. కేసీఆర్ అయితే టీఆరెస్ ను జాతీయ పార్టీగా మలిచేందుకు విస్తృత ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు.

కేజ్రీవాల్ ఏమంటున్నారు ?

సంకీర్ణ కూటమి పట్ల తనకు నమ్మకం లేదని, ఈ దేశంలోని 130 కోట్ల మంది ప్రజలతో ఓ కూటమిని ఏర్పాటు చేస్తానని కేజ్రీవాల్ కొన్ని వారాల క్రితం ప్రకటించారు. ఢిల్లీ తరువాత పంజాబ్ లో పాగా వేసిన ఆప్.. త్వరలో కొన్ని రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో కూడా తన సత్తా చాటాలని చూస్తోంది. పైగా ఇటీవలి కాలంలో బీజేపీని తీవ్రంగా దుయ్యబడుతున్న కేజ్రీవాల్,. ఈ సమయంలో విపక్షాలను ఐక్యం చేసేందుకు మమతా బెనర్జీ లీడ్ తీసుకోవడం పట్ల అంత ఆసక్తి చూపడంలేదు. పంజాబ్ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించడంతో జాతీయ రాజకీయాల్లో తామే చురుకైన పాత్ర వహించగలమని ఆప్ భావిస్తోంది. ఇక ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీని కూడా మమత ఆహ్యానించడాన్నిఆప్ వర్గాలకు రుచించడంలేదు.

మాకేమీ ఆహ్వానం అందలేదు.. బిజూ జనతాదళ్

దీదీ నిర్వహిస్తున్న సమావేశానికి హాజరు కావలసిందిగా తమ కేమీ ఆహ్వానం అందలేదని ఒడిశాలో పాలక పార్టీ బిజూ జనతాదళ్ వెల్లడించింది. లోక్ సభలో ఈ పార్టీ నేత పినాకి మిశ్రా ఇదే మాట చెబుతూ.. తాము ఎప్పుడూ బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి సమాన దూరంలో ఉంటున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా తాము ఇదే విధానాన్ని అనుసరిస్తామని ఈ పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినంతవరకు అభ్యర్థి విషయంలో తమ పార్టీ నేత, సీఎం నవీన్ పట్నాయక్ సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని పినాకి మిశ్రా తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికలో బిజూ జనతాదళ్ రోల్ కూడాముఖ్యమే మరి !
ఇక లెఫ్ట్ పార్టీలు మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పేరును సూచిస్తున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈ పదవికి తాను రేసులో ఉండబోనని ప్రకటించిన నేపథ్యంలో ఈ పార్టీలు తాజాగా నిన్న ఆయనతో సమావేశమయ్యాయి. ఈ ప్రతిపాదనకు పవార్ అభ్యంతరం చెప్పలేదని సమాచారం.
ఢిల్లీ, విపక్షాలు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాష్ట్రపతి ఎన్నిక, అభ్యర్థి, కెసిఆర్, కేజ్రీవాల్, ఆప్, బిజూ జనతాదళ్,
First Published:  15 Jun 2022 1:58 AM GMT
Next Story