Telugu Global
National

ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత దారుణ వ్యాఖ్య.. ‘కుక్క చావు చావాలంటూ’ !

ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఒకరు దారుణ వ్యాఖ్య చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో తమ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తున్నందుకు నిరసనగా ఓ వైపు ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేస్తుండగా.. ఈ నాయకుడొకరు మోడీనే ఢీ కొట్టాలనుకున్నాడో ఏమో.. ఆయన ‘కుక్కచావు’ చావాలని మరీ శాపనార్థాలు పెట్టాడు. షేక్ హుసేన్ అనే ఈ నేత మహారాష్ట్రకు చెందిన లీడర్. నాగపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న […]

ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత దారుణ వ్యాఖ్య.. ‘కుక్క చావు చావాలంటూ’ !
X

ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఒకరు దారుణ వ్యాఖ్య చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో తమ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తున్నందుకు నిరసనగా ఓ వైపు ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేస్తుండగా.. ఈ నాయకుడొకరు మోడీనే ఢీ కొట్టాలనుకున్నాడో ఏమో.. ఆయన ‘కుక్కచావు’ చావాలని మరీ శాపనార్థాలు పెట్టాడు.

షేక్ హుసేన్ అనే ఈ నేత మహారాష్ట్రకు చెందిన లీడర్. నాగపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈయన.. దేశానికి సోనియా, రాహుల్ గాంధీలు చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ.. ఒకదశలో రెచ్చిపోయాడు. సోనియా లేదా రాహుల్ గాంధీలకు ఏ కాస్త హాని జరిగినా ఈ దేశం రావణ కాష్టంలా మారుతుందని, అప్పుడు ఎవరూ దీన్ని రక్షించలేరని వ్యాఖ్యానించాడు. ఇండియాకు మోడీ చేసిందేమీ లేదని దెప్పిపొడిచాడు. ప్రధాని పట్ల ఇంతటి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నేతలు మండిపడ్డారు. వారి ఫిర్యాదు మేరకు షేక్ హుసేన్ పై నాగపూర్ పోలీసులు కేసు పెట్టారు. ఐపీసీ లోని 294, 504 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.

మూడో రోజు కూడా రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారిస్తున్నందుకు ఆగ్రహించిన కాంగ్రెస్ శ్రేణులు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. పార్టీకి చెందిన ఉన్నత నాయకులను, చివరకు కాంగ్రెస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఢిల్లీలో భారీ సంఖ్యలో పోలీసులను, పారా మిలిటరీ బలగాలను, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలను కేంద్ర‌ప్రభుత్వం రంగంలోకి దించింది. బుధవారం ఒక దశలో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయి ఈడీ కార్యాలయం ఎదుట రెండు టైర్లను తగలబెట్టారు. కనీసం తమ నిరసనను తెలియజేయడానికైనా పోలీసులు తమను అనుమతించడం లేదని, అదేపనిగా తమను వేధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

‘ఢిల్లీ పోలీసులు మా వాళ్ళను కొట్టారు’
ఢిల్లీ పోలీసులు తమ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి చొరబడి తమ పార్టీ కార్యకర్తలను లాఠీలతో చితకబాదారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇది గూండాయిజమని, ఈ పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. ఇది క్రిమినల్ ట్రెస్ పాస్.. ఇలాంటివాటిని మేం సహించం అని ఆయన హెచ్చరించారు.

First Published:  15 Jun 2022 6:53 AM GMT
Next Story