Telugu Global
NEWS

ఏకంగా పెద్దాయననే టార్గెట్ చేసిన జోగి రమేశ్

ప్రత్యర్థులపై మాటల తూటాలతో విరుచుకుపడే జోగి రమేశ్ .. ఈసారి నేరుగా ఓ పత్రికాధిపతినే టార్గెట్ చేశాడు. ఏకంగా రామోజీరావునూ విమర్శించారు. రాష్ట్రంలోని రెండు పత్రికల్లో నిత్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. విషయం ఏమీ లేకపోయినా.. చిన్న అంశాలను కూడా పెద్దవిగా చేసి బ్యానర్ స్టోరీలుగా వండి వారుస్తున్నారు. ఇదిలా ఉంటే ‘పునాది దాటని పేదిళ్లు’ అంటూ ఈనాడు పత్రిక ఓ కథనం రాసింది. పేదలకు సొంతిళ్లు కట్టడం ప్రభుత్వానికి ఇష్టం లేదని.. […]

ఏకంగా పెద్దాయననే టార్గెట్ చేసిన జోగి రమేశ్
X

ప్రత్యర్థులపై మాటల తూటాలతో విరుచుకుపడే జోగి రమేశ్ .. ఈసారి నేరుగా ఓ పత్రికాధిపతినే టార్గెట్ చేశాడు. ఏకంగా రామోజీరావునూ విమర్శించారు. రాష్ట్రంలోని రెండు పత్రికల్లో నిత్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. విషయం ఏమీ లేకపోయినా.. చిన్న అంశాలను కూడా పెద్దవిగా చేసి బ్యానర్ స్టోరీలుగా వండి వారుస్తున్నారు. ఇదిలా ఉంటే ‘పునాది దాటని పేదిళ్లు’ అంటూ ఈనాడు పత్రిక ఓ కథనం రాసింది.

పేదలకు సొంతిళ్లు కట్టడం ప్రభుత్వానికి ఇష్టం లేదని.. అది సాధ్యం కూడా కాదని ఆ కథనం సారాంశం. అయితే ఈనాడులో వచ్చిన కథనంపై మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ‘రామోజీరావుకు కళ్లు కనిపించవా? రాష్ట్ర వ్యాప్తంగా గృహనిర్మాణం జోరుగా జరుగుతోంది. ప్రతి గ్రామంలోనూ ఇళ్లు కడుతున్నాం. కానీ రామోజీరావుకు ఇవేమీ పట్టవా? నోటికొచ్చినట్టు కథనాలు రాస్తారా? 14 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ఎన్ని ఇళ్లు నిర్మించారు? ప్రస్తుతం ఎన్ని ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి.

ఈనాడు అధినేత రామోజీరావుకు ఈ విషయం పట్టదా? చంద్రబాబును ఇంప్రెస్ చేసేందుకు తప్పుడు కథనాలు రాయడమేనా?’ అంటూ ఆయన విరుచుకుపడ్డారు. అయితే పత్రికలో తప్పుడు కథనాలు వస్తే.. ఖండించడం మామూలే. కొందరైతే పట్టించుకోకుండా వదిలేస్తారు? ఇదిలా ఉంటే జోగి రమేశ్ ఏకంగా పత్రికాధినేతపైనే విమర్శలు చేయడం గమనార్హం. గతంలోనూ కొందరు ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే‌పై ఆరోపణలు చేశారు. కాగా..మంత్రి వ్యాఖ్యలకు ఎలాంటి కౌంటర్లు వస్తాయో.. వేచి చూడాలి.

First Published:  13 Jun 2022 7:30 AM GMT
Next Story