Telugu Global
National

దళిత‌ కవి కవితను పాఠ్యాంశాల్లోంచి తొలిగించాలని కర్నాటక మంత్రి ఆదేశం!

కర్నాటకలో పాఠ్యపుస్తకాలలో సిలబస్ మార్చే కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. ప్రతి పక్షాలు ఈ వ్యవహారాన్ని ఒకవైపు విమర్షిస్తుండగానే బీజేపీ సర్కారు మాత్రం తన ప్రణాళికను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా 4వ తరగతి పాఠ్యపుస్తకం నుండి దివంగత దళిత కవి సిద్దలింగయ్య రచించిన ‘భూమి’ అనే కవితను తొలగించాలని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బి.సి.నగేష్ ఆదేశాలు జారీ చేశారు. ఆ కవిత లో సూర్య, చంద్రులు దేవుళ్ళు కాదని, భగవంతుణ్ణి, ఆత్మను ఎవరూ చూడలేదని, శాస్త్రాలు, పురాణాలు అబద్ధాల […]

దళిత‌ కవి కవితను పాఠ్యాంశాల్లోంచి తొలిగించాలని కర్నాటక మంత్రి ఆదేశం!
X

కర్నాటకలో పాఠ్యపుస్తకాలలో సిలబస్ మార్చే కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. ప్రతి పక్షాలు ఈ వ్యవహారాన్ని ఒకవైపు విమర్షిస్తుండగానే బీజేపీ సర్కారు మాత్రం తన ప్రణాళికను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా 4వ తరగతి పాఠ్యపుస్తకం నుండి దివంగత దళిత కవి సిద్దలింగయ్య రచించిన ‘భూమి’ అనే కవితను తొలగించాలని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బి.సి.నగేష్ ఆదేశాలు జారీ చేశారు.

ఆ కవిత లో సూర్య, చంద్రులు దేవుళ్ళు కాదని, భగవంతుణ్ణి, ఆత్మను ఎవరూ చూడలేదని, శాస్త్రాలు, పురాణాలు అబద్ధాల మూటలేనని కవి సిద్దరామయ్య రచించారు. చాలా ఏళ్ళుగా ఆ కవిత 4వ తరగతి పాఠ్యాంశాల్లో బోధిస్తున్నారు. అయితే హిందుత్వ భావాలకు వ్యతిరేకంగా ఉన్న పాఠ్యాంశాలన్నింటినీ తొలగించాలని నిర్ణయం తీసుకున్న కర్నాటక బీజేపీ సర్కారు ‘భూమి’ కవితను కూడా తొలగించాలని ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కవిత వల్ల మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని వచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. కాంగ్రెస్ హయాంలో బరగూరు రామచంద్రప్ప నేతృత్వంలోని పాఠ్యపుస్తకాల రివిజన్ కమిటీ ఈ కవితను సిలబస్‌లో పొందుపరిచింది.

First Published:  11 Jun 2022 9:42 AM GMT
Next Story