Telugu Global
NEWS

కదిరి టీడీపీలో గ్యాంగ్ వార్

సత్యసాయి జిల్లా కదిరి టీడీపీలో వర్గ విభేదాలు గ్యాంగ్ వార్ ను తలపిస్తున్నాయి. ఇక్కడ టిడిపి రెండు వర్గాలుగా చీలిపోయింది. మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా, టీడీపీ ఇంచార్జి కందికుంట వెంకటప్రసాద్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది . ఇపుడా ఆధిపత్యపోరు రోడ్డున పడింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. కొంతకాలంగా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి దక్కుతుంది అన్నదానిపై మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా, టిడిపి నియోజకవర్గ ఇన్ చార్జ్ కందికుంట […]

former-mla-chand-basha-and-tdp-constituen
X

సత్యసాయి జిల్లా కదిరి టీడీపీలో వర్గ విభేదాలు గ్యాంగ్ వార్ ను తలపిస్తున్నాయి. ఇక్కడ టిడిపి రెండు వర్గాలుగా చీలిపోయింది. మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా, టీడీపీ ఇంచార్జి కందికుంట వెంకటప్రసాద్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది . ఇపుడా ఆధిపత్యపోరు రోడ్డున పడింది.

ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. కొంతకాలంగా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి దక్కుతుంది అన్నదానిపై మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా, టిడిపి నియోజకవర్గ ఇన్ చార్జ్ కందికుంట ప్రసాద్ వర్గాల మధ్య సోషల్ మీడియాలో పెద్దఎత్తున వివాదం నడుస్తోంది .

టికెట్ తమ నాయకుడికే వస్తుంది అంటూ అవతలి వారిని రెచ్చగొట్టేలా శుక్రవారం చాంద్ బాషా అనుచరుడు శ్రీనివాస్ నాయుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. దాంతో శ్రీనివాస్ నాయుడు పై దాడి చేసేందుకు కందికుంట ప్రసాద్ వర్గీయులు నిన్నంతా వెతికారు. చివరకు బస్టాండ్ వద్ద అతడు దొరకడంతో మూకుమ్మడిగా ఆరుగురు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. నడిరోడ్డు పైన దాడి చేశారు .

దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ నాయుడుని తొలుత కదిరి స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతరం అనంతపురం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. 2014లో వైసిపి తరపున ఎమ్మెల్యేగా గెలిచిన చాంద్ బాషా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు . కందికుంట ప్రసాద్ చాలా కాలంగా టిడిపిలో ఉన్నారు. ఆయనపైన పలు ఆర్థిక నేరాల కేసులు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకునేందుకు ఈ ఇద్దరు నేతలు పోటాపోటీగా పావులు కదుపుతున్నారు.

First Published:  11 Jun 2022 1:06 AM GMT
Next Story