Telugu Global
MOVIE UPDATES

‘అంటే సుందరానికీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా పవన్..!

శ్యామ్ సింగరాయ్ సూపర్ హిట్ తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా అంటే సుందరానికీ. ఇందులో నానికి జోడిగా నజ్రియా హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిన అంటే సుందరానికీ సినిమా ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది. దీంతో ఈ చిత్ర యూనిట్ ముమ్మరంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. సినిమా వివిధ భాషల్లో విడుదల అవుతుండటంతో నాని, నజ్రియా దేశంలోని […]

‘అంటే సుందరానికీ’  ప్రీ రిలీజ్ ఈవెంట్  గెస్ట్ గా పవన్..!
X

శ్యామ్ సింగరాయ్ సూపర్ హిట్ తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా అంటే సుందరానికీ. ఇందులో నానికి జోడిగా నజ్రియా హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిన అంటే సుందరానికీ సినిమా ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది. దీంతో ఈ చిత్ర యూనిట్ ముమ్మరంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది.

సినిమా వివిధ భాషల్లో విడుదల అవుతుండటంతో నాని, నజ్రియా దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు ఈ మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.

రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీలో సినిమా టికెట్ల ధరల పై పవన్ కళ్యాణ్ బహిరంగంగా విమర్శలు వ్యక్తం చేశారు. పవన్ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమరాన్ని సృష్టించాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు హీరో నాని మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో నాని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read : స్పై’ మూవీ గ్లింప్స్..

First Published:  7 Jun 2022 9:47 PM GMT
Next Story