Telugu Global
NEWS

తెలంగాణ‌కు మాట‌లు.. గుజ‌రాత్‌కు మూట‌లా..?

వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్‌లో వరద ముంపు ప్రమాదం ఏర్పడుతుంది. గత కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ముంపు ముప్పును తప్పించేందుకు పలు అభివృద్ధి పనులు చేపట్టింది. అదే సమయంలో వరద సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నా.. ఒక్క పైసా విదిల్చడం లేదు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీని నిలదీశారు. ‘మోడీ గారూ.. మీరు సామాజిక సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నారా? ప్రభుత్వం నడుపుతున్నారా? లేదా స్వచ్చంద సేవా సంస్థనా?’ అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌కు […]

Modi and KTR
X

వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్‌లో వరద ముంపు ప్రమాదం ఏర్పడుతుంది. గత కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ముంపు ముప్పును తప్పించేందుకు పలు అభివృద్ధి పనులు చేపట్టింది. అదే సమయంలో వరద సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నా.. ఒక్క పైసా విదిల్చడం లేదు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీని నిలదీశారు. ‘మోడీ గారూ.. మీరు సామాజిక సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నారా? ప్రభుత్వం నడుపుతున్నారా? లేదా స్వచ్చంద సేవా సంస్థనా?’ అని ఎద్దేవా చేశారు.

హైదరాబాద్‌కు రావల్సిన వరద పునరావాస నిధులపై అప్డేట్ ఇస్తారా? మూసీ పునరుజ్జీవనానికి , హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఏమైనా సాయం చేస్తారా? ఐటీఐఆర్ విషయంలో ఏమైనా పురోగతి ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణకేమో మాటలు.. గుజరాత్‌కు మూటలా అని ఎద్దేవా చేశారు.

కాగా అంతకు ముందు టీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఈ శతాబ్దంలోనే అత్యంత దారుణమైన వరదలను హైదరాబాద్ గతేడాది అనుభవించిందని.. కానీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని పేర్కొన్నారు. 2018 నుంచి 2022 వరకు 21 రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ కింద భారీగా నిధులు విడుదల చేసినా.. తెలంగాణకు మాత్రం ఎలాంటి నిధులు విడుదల చేయలేదన్నారు.

పక్కన ఉన్న ఏపీకి 2018-19లో రూ. 1004.88 కోట్లు, 2019-20లో రూ. 570.91 కోట్లు, 2020-21లో 657.029 కోట్లు ఎన్టీఆర్ఎఫ్ నిధులు విడుదల చేశారు. గుజరాత్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు కూడా భారీగానే నిధులు విడుదలయ్యాయి. కానీ తెలంగాణ ఎప్పటి నుంచో హైదరాబాద్ వరద ముప్పు నుంచి కాపాడటానికి అవసరమైన నాలాల విస్తరణ కోసం నిధులను మాత్రం కేంద్ర విడుదల చేయడం లేదు.

ALSO READ: రాజమండ్రిలో హాట్ కామెంట్స్.. జయప్రద ఏపీకి ఫిక్స్ అయినట్టేనా?

First Published:  7 Jun 2022 10:06 PM GMT
Next Story