Telugu Global
MOVIE UPDATES

శర్వాకి జోడిగా రాశీ ఖన్నా..!

కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు యంగ్ హీరో శర్వానంద్. మహానుభావుడు సినిమా తర్వాత శర్వానంద్ కి సరైన హిట్ పడలేదు. శ్రీకారం సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చినా బాక్సాఫీసు వద్ద హిట్ కాలేదు. ఇక భారీ అంచనాలతో వచ్చిన మహాసముద్రం సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది. ఈ వేసవిలో ఆడవాళ్లు మీకు జోహార్లు అనే కుటుంబ కథా చిత్రంతో ముందుకు వచ్చినా […]

Rashi Khanna
X

కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు యంగ్ హీరో శర్వానంద్. మహానుభావుడు సినిమా తర్వాత శర్వానంద్ కి సరైన హిట్ పడలేదు. శ్రీకారం సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చినా బాక్సాఫీసు వద్ద హిట్ కాలేదు. ఇక భారీ అంచనాలతో వచ్చిన మహాసముద్రం సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది.

ఈ వేసవిలో ఆడవాళ్లు మీకు జోహార్లు అనే కుటుంబ కథా చిత్రంతో ముందుకు వచ్చినా అదికూడా శర్వానంద్ ను ఆదుకోలేదు. ప్రస్తుతం శర్వానంద్ ఒకే ఒక జీవితం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమా చేయనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఇందులో శర్వానంద్ కు జోడిగా రాశీ ఖన్నాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో ఈ సినిమాలో నటించేందుకు రాశీ ఖన్నా అంగీకారం తెలిపినట్లు సమాచారం. శర్వానంద్, రాశీ ఖన్నా కాంబినేషన్ లో సినిమా రావడం ఇదే తొలిసారి. ఈ సినిమాలో శర్వానంద్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన బరువు తగ్గే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇదే నెలలో లాంఛనంగా ప్రారంభించి, వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ALSO READ: మేజర్ సినిమా మహేష్ బాబు చేసుంటే..?

First Published:  6 Jun 2022 10:50 PM GMT
Next Story