Telugu Global
National

ఇండియాపై ఇస్లామిక్ దేశాల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేంద్రం

ఓ టీవీ డిబేట్‌లో మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తమ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పలు ముస్లిం దేశాలు ఇండియా వస్తువుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. అంతే కాకుండా హిందూ ఉద్యోగులను పనులకు రానివ్వమని హెచ్చరికలు కూడా చేశాయి. ఇప్పటికే పలు అరబ్ దేశాలు భారత రాయబారులు, హైకమిషనర్లకు సమన్లు జారీ చేశాయి. వెంటనే ఈ వ్యాఖ్యలపై వివరణ తెలపాలని డిమాండ్ […]

ఇండియాపై ఇస్లామిక్ దేశాల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేంద్రం
X

ఓ టీవీ డిబేట్‌లో మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తమ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పలు ముస్లిం దేశాలు ఇండియా వస్తువుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. అంతే కాకుండా హిందూ ఉద్యోగులను పనులకు రానివ్వమని హెచ్చరికలు కూడా చేశాయి. ఇప్పటికే పలు అరబ్ దేశాలు భారత రాయబారులు, హైకమిషనర్లకు సమన్లు జారీ చేశాయి. వెంటనే ఈ వ్యాఖ్యలపై వివరణ తెలపాలని డిమాండ్ చేశాయి.

ఇదే అంశంలో 57 ముస్లిం కంట్రీస్ సభ్యులుగా ఉండే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) జనరల్ సెక్రటేరియట్ కూడా స్పందించింది. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు ఆ ప్రభుత్వ అజెండానే అని, ఇది ఇండియన్ గవర్నమెంట్ బుద్దిని బయటపెట్టిందని ఆరోపించింది. మోడీ ప్రభుత్వ సంకుచిత మనస్తత్వానికి ఇది అద్దం పడుతుందని, దేశంలో అవాంఛనీయ పరిస్థితులు దారి తీయడానికి కారణం కూడా అయ్యిందని విమర్శించింది. మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి మోడీకి చెందిన బీజేపీ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని ఓఐసీ స్పష్టం చేసింది.

కాగా, ఓఐసీ జనరల్ సెక్రటరీ ఇండియా టార్గెట్‌గా చేసిన విమర్శలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండియాను తప్పుపడుతూ ఓఐసీ చేసిన వ్యాఖ్యలు మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చాయన్నారు. అయితే వాటిని స్వాగతించడం గానీ, సమర్దించడం గానీ చేయడం లేదని పేర్కొన్నారు. ఈ దేశంలో అన్ని మతాలు సమానమేనని, సామాజిక అశాంతికి ఇక్కడ తావులేని ఆయన స్పష్టం చేశారు.

మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతమైనవే కానీ, భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని బాగ్చీ స్పష్టం చేశారు. ఒకరి వ్యక్తిగత మాటలను బేస్ చేసుకొని భారత ప్రజలను, ప్రభుత్వాన్ని తప్పుబడుతూ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అన్నారు. ఇండియాను మతపరమైన దృష్టితో చూడం మానుకోవాలని ఆయన ఓఐసీకి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ అన్ని మతాలు సమానమేనని గుర్తించాలన్నారు. సంకుచిత భావంతో ఓఐసీ చేసిన కామెంట్లను ఖండిస్తున్నట్లు బాగ్చీ పేర్కొన్నారు.

First Published:  6 Jun 2022 4:43 AM GMT
Next Story