Telugu Global
National

ప్రాణాలు కాపాడలేం, బదిలీ మాత్రం చేయగలం..

జమ్మూ కాశ్మీర్ లో కాశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఉగ్ర దాడుల్లో ఇప్పటికే 8మంది బలయ్యారు. దీంతో మిగతావారిలో భయాందోళనలు నెలకొన్నాయి. కాశ్మీర్ లోయను వారంతా ఖాళీ చేసి పునరావాస శిబిరాలకు తరలి వెళ్తున్నారు. ప్రభుత్వం వీరికోసం శ్రీనగర్ లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసింది. మరోవైపు ఉద్యోగులు కూడా బతుకు జీవుడా అంటూ బదిలీకోసం వేడుకుంటున్నారు. కొన్నిరోజులుగా ప్రభుత్వం వారికి భరోసా కల్పిస్తున్నా.. హత్యాకాండ ఆగకపోయే సరికి మెట్టు దిగక తప్పలేదు. కాశ్మీర్ లోయలో […]

survivors-cannot-be-saved-only-transfers-can-be-made
X

జమ్మూ కాశ్మీర్ లో కాశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఉగ్ర దాడుల్లో ఇప్పటికే 8మంది బలయ్యారు. దీంతో మిగతావారిలో భయాందోళనలు నెలకొన్నాయి. కాశ్మీర్ లోయను వారంతా ఖాళీ చేసి పునరావాస శిబిరాలకు తరలి వెళ్తున్నారు. ప్రభుత్వం వీరికోసం శ్రీనగర్ లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసింది. మరోవైపు ఉద్యోగులు కూడా బతుకు జీవుడా అంటూ బదిలీకోసం వేడుకుంటున్నారు.

కొన్నిరోజులుగా ప్రభుత్వం వారికి భరోసా కల్పిస్తున్నా.. హత్యాకాండ ఆగకపోయే సరికి మెట్టు దిగక తప్పలేదు. కాశ్మీర్ లోయలో ఉద్యోగాలు చేస్తున్న పండిట్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇప్పటి వరకూ 177మంది ఉద్యోగుల్ని కేంద్రం బదిలీ చేసింది. వారంతా పెట్టేబేడా సర్దుకుని తిరిగి వెళ్లిపోతున్నారు.

1990 ప్రాంతంలో కాశ్మీర్‌ లోయలో అల్ప సంఖ్యాక వర్గాలుగా ఉన్న కాశ్మీరీ పండిట్లపై జరిగిన దాడుల తర్వాత ఆయా కుటుంబాలు వలసబాట పట్టాయి. వారందర్నీ తిరిగి సొంత ప్రాంతాలకు రప్పించాలనే ఉద్దేశంతో.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రత్యకే ప్యాకేజీ ప్రకటించి మరీ కాశ్మీర్ లోయకి తీసుకెళ్లింది. పునరావాస ప్యాకేజీ కింద ఎస్సీ కోటాలో ఉద్యోగాలిచ్చింది. వారికి ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. దీంతో చాలామంది పండిట్లు.. తిరిగి కాశ్మీర్ లోయకి వచ్చారు. ఉద్యోగాలు చేసుకుంటున్నారు.

ఈ వ్యవహారం ఉగ్రమూకలకు నచ్చలేదు. కాశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని ప్రాణాలు తీస్తున్నారు ఉగ్రవాదులు. వారం రోజుల వ్యవధిలోనే ఉగ్రవాదులు 8 మందిని టార్గెట్‌ చేసి హత్య చేశారు. పోలీస్, టీచర్, బ్యాంక్ ఉద్యోగి, వలస కూలీ.. ఇలా అందర్నీ మట్టుబెట్టారు. దీంతో ఒక్కసారిగా కాశ్మీరీ పండిట్లు అభద్రతా భావానికి గురయ్యారు. వలస కూలీలు, ఇతర వ్యాపారులు అన్నీ సర్దుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరుగు ప్రయాణం అయ్యారు.

ఉద్యోగులు మాత్రం బదిలీ చేస్తే వెళ్లిపోతామని కేంద్రాన్ని వేడుకున్నారు. ప్రభుత్వం కొన్నిరోజులుగా ఈ విషయంలో తాత్సారం చేస్తూ వస్తోంది. అయితే వరుసగా ప్రాణాలు బలవుతుండటంతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. హోం మంత్రి అమిత్ షా..

క్రీడా మంత్రి అయితే బాగుండని.. సొంత పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సెటైర్లు కూడా వేశారు. దీంతో హోం మంత్రి అమిత్ షా, ఆర్మీ చీఫ్‌ మనోజ్ సిన్హా, జమ్మూ కాశ్మీర్‌ ఉన్నతాధికారులలో భేటీ అయ్యారు. ఈ సమావేశం జరిగిన మరుసటి రోజే టీచర్ల బదిలీపై ఉత్తర్వులు విడుదలయ్యాయి. ప్రాణాలు కాపాడలేమని చేతులెత్తేసిన కేంద్రం ఇలా బదిలీ ఉత్తర్వులిచ్చి పరువు కాపాడుకోవాలనుకుంటోంది.

First Published:  4 Jun 2022 6:30 AM GMT
Next Story