Telugu Global
National

అమిత్ షాను క్రీడాశాఖ మంత్రిని చేయండి

కశ్మీర్‌లో పండిట్ల వరుస హత్యలు కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సొంత పార్టీ నాయకులు కూడా అమిత్ షా వైపు వేలెత్తి చూపుతున్నారు. నెల వ్యవధిలోనే 8 మంది కశ్మీర్ పండిట్లు హత్యకు గురయ్యారు. 1990 నాటి పరిస్థితులను గుర్తుకు చేసుకుంటున్న పండిట్లు వలస బాట పట్టారు. దాదాపు 4వేల మంది పండిట్ ఉద్యోగులు వలస బాట పట్టారు. పండిట్లు వలస వెళ్తే తమ పరువు పోతుందన్న ఉద్దేశంతో వారిని బలవంతంగా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీనగర్- […]

అమిత్ షాను క్రీడాశాఖ మంత్రిని చేయండి
X

కశ్మీర్‌లో పండిట్ల వరుస హత్యలు కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సొంత పార్టీ నాయకులు కూడా అమిత్ షా వైపు వేలెత్తి చూపుతున్నారు. నెల వ్యవధిలోనే 8 మంది కశ్మీర్ పండిట్లు హత్యకు గురయ్యారు. 1990 నాటి పరిస్థితులను గుర్తుకు చేసుకుంటున్న పండిట్లు వలస బాట పట్టారు. దాదాపు 4వేల మంది పండిట్ ఉద్యోగులు వలస బాట పట్టారు. పండిట్లు వలస వెళ్తే తమ పరువు పోతుందన్న ఉద్దేశంతో వారిని బలవంతంగా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీనగర్- జమ్మూ రహదారిపై చెక్‌పోస్టులు పెట్టి తిరిగి క్యాంపులకు వెళ్లిపోవాలని అధికారులు కోరుతున్నారు. కొందరు ప్రమోషన్లు వచ్చినా కశ్మీర్‌ లోయకు వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. గురువారం బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ హత్యతో పండిట్లలో భయం మరింత పెరిగింది.

ఈ పరిస్థితికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్ చేశారు. అక్కడ రాష్ట్రపతి పాలన ఉన్నప్పటికీ రోజుకో కశ్మీరీ హిందువు హత్యకు గురవుతున్నారని..ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా అమిత్ షా రాజీనామా చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అమిత్ షాను హోంమంత్రి పదవి నుంచి తప్పించి క్రీడాశాఖ మంత్రిగా నియమించాలని సలహా ఇచ్చారు. క్రికెట్ పై ఇటీవల అవసర ఆసక్తి పెరుగుతోందన్నారు.

కశ్మీర్ పండిట్లు మరోసారి వలసబాట పట్టడానికి ప్రధాని నరేంద్రమోడీనే బాధ్యత వహించాలని ఎంఐఎం అధ్యక్షుడు ఒవైసీ డిమాండ్ చేశారు. మోడీ తప్పుల కారణంగానే 1989 నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయన్నారు. పండిట్లను బీజేపీ కేవలం రాజకీయంగా మాత్రమే వాడుకుంటోందని… సినిమాలను ప్రమోట్ చేయడంలో మాత్రమే మోడీ ప్రభుత్వానికి ఆసక్తి ఉందని ఓవైసీ విమర్శించారు. పండిట్ల వరుస హత్యలతో విమర్శలు తీవ్రతరం కావడంతో ఏం చేయాలన్న దానిపై చర్చించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌, రా చీఫ్‌ గోయల్‌తో అమిత్ షా సమావేశం నిర్వహించారు.

ALSO READ: బొగ్గుపై జెన్‌కోలకు కేంద్రం మరో హెచ్చరిక

First Published:  2 Jun 2022 10:50 PM GMT
Next Story