Telugu Global
NEWS

తెలంగాణపై కొత్తగా పుట్టుకొచ్చిన ప్రేమ..

ఇటీవల కొంతకాలంగా తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెంచింది. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే వ్యూహంతో పావులు కదుపుతున్నారు నేతలు. వరుస ఉప ఎన్నికల్లో సత్తా చూపడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ని ముప్పతిప్పలు పెట్టడంతో బీజేపీ కాస్త ఎక్కువగానే ఊహల్లో మునిగితేలుతోంది. అదే సమయంలో అధినాయకత్వం కూడా తెలంగాణపై మనసుపారేసుకుంది. కేంద్ర రాజకీయాల్లోకి రావాలనుకుంటూ కూటములకు జవసత్వాలు సమకూరుస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కి చెక్ పెట్టడంతోపాటు, తెలంగాణలో అధికారం జేచిక్కించుకోవడమే పరమావధిగా బీజేపీ అగ్రనాయకత్వం […]

newly-born-love-for-telangana
X

ఇటీవల కొంతకాలంగా తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెంచింది. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే వ్యూహంతో పావులు కదుపుతున్నారు నేతలు. వరుస ఉప ఎన్నికల్లో సత్తా చూపడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ని ముప్పతిప్పలు పెట్టడంతో బీజేపీ కాస్త ఎక్కువగానే ఊహల్లో మునిగితేలుతోంది. అదే సమయంలో అధినాయకత్వం కూడా తెలంగాణపై మనసుపారేసుకుంది. కేంద్ర రాజకీయాల్లోకి రావాలనుకుంటూ కూటములకు జవసత్వాలు సమకూరుస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కి చెక్ పెట్టడంతోపాటు, తెలంగాణలో అధికారం జేచిక్కించుకోవడమే పరమావధిగా బీజేపీ అగ్రనాయకత్వం కొత్త వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ని వేదికగా ఎంచుకుంది.

బీజేపీ నేషనల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బి.ఎల్‌. సంతోష్‌ హైదరాబాద్ కి వచ్చి ఈ సమావేశాలకోసం సమీక్ష నిర్వహించారు. భాగ్యనగరంలో మూడు రోజల పాటు జరిగే ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా తో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. ప్రధాని మోదీ సహా కీలక నేతలంతా మూడు రోజులపాటు హైదరాబాద్ లోనే బస చేస్తారు. సహజంగా ఉత్తరాదిలోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది బీజేపీ. ఇప్పుడు హైదరాబాద్ ని జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికగా ఎంపిక చేసుకోవడం.. ఎన్నికల స్టంట్ కాక మరోటి కాదని టీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

కేంద్రం ఆధ్వర్యంలో అవతరణ దినోత్సవం..

దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారిగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ని వేదికగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ వేడుకల్లో గాయకులు మంగ్లీ, హేమచంద్ర సహా తెలంగాణకు చెందిన జానపద కళాకారులు పాల్గొనబోతున్నారు. గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఇప్పుడు కేంద్రం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై ఫోకస్ పెట్టడం పలు సందేహాలకు తావిస్తోంది. తెలంగాణలో ఉనికికోసం కష్టపడుతున్న బీజేపీ.. ఇలాగైనా తెలంగాణ ప్రజల మనసులకు దగ్గరవ్వాలనుకుంటోందనే అనుమానం బలపడుతోంది.

ALSO READ : తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

First Published:  1 Jun 2022 5:34 AM GMT
Next Story