Telugu Global
National

చరిత్ర సృష్టించిన బిషప్ పూల ఆంథోనీ.. చరిత్రలో తొలి తెలుగు కార్డినల్

క్రైస్తవ మతంలో ఉన్న రెండు ముఖ్యమైన శాఖలు క్యాథలిక్, ప్రొటస్టెంట్స్. వీటిలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంఘటితంగా ఉన్నది కేవలం క్యాథలిక్ సమాజం మాత్రమే. రోమన్ క్యాథలిక్ మిషన్ (ఆర్‌సీఎం)గా పిలువబడే ఈ చర్చీల అధినేతగా పోప్ ఉంటారు. వీళ్లకు ముఖ్య కేంద్రం వాటికన్. పోప్ తర్వాత స్థానంలో కార్డినల్ ఉంటారు. ప్రపంచ దేశాల నుంచి అతి కొద్ది మందిని మాత్రమే కార్డినల్ (మతాధిపతి)గా నియమిస్తారు. ఇప్పటి వరకు అతి కొద్ది మంది ఇండియన్ ఆర్చ్ బిషప్‌లకు మాత్రమే […]

చరిత్ర సృష్టించిన బిషప్ పూల ఆంథోనీ.. చరిత్రలో తొలి తెలుగు కార్డినల్
X

క్రైస్తవ మతంలో ఉన్న రెండు ముఖ్యమైన శాఖలు క్యాథలిక్, ప్రొటస్టెంట్స్. వీటిలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంఘటితంగా ఉన్నది కేవలం క్యాథలిక్ సమాజం మాత్రమే. రోమన్ క్యాథలిక్ మిషన్ (ఆర్‌సీఎం)గా పిలువబడే ఈ చర్చీల అధినేతగా పోప్ ఉంటారు. వీళ్లకు ముఖ్య కేంద్రం వాటికన్. పోప్ తర్వాత స్థానంలో కార్డినల్ ఉంటారు. ప్రపంచ దేశాల నుంచి అతి కొద్ది మందిని మాత్రమే కార్డినల్ (మతాధిపతి)గా నియమిస్తారు. ఇప్పటి వరకు అతి కొద్ది మంది ఇండియన్ ఆర్చ్ బిషప్‌లకు మాత్రమే ఈ హోదా దక్కింది.

తాజాగా పోప్ ఫ్రాన్సిస్.. ఇండియా నుంచి ఇద్దరు ఆర్చ్ బిషప్‌లను కార్డినల్స్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గోవా ఆర్చ్ బిషప్ నెరీ ఫెర్రో, హైదరాబాద్ ఆర్చ్ బిషప్ పూల ఆంథోనీలకు కార్డినల్స్‌గా హోదా పెంచారు. ప్రపంచ వ్యాప్తంగా 21 మంది ఆర్చ్ బిషప్‌లకు కార్డినల్ హోదా దక్కగా.. వీరిలో ఇద్దరు మాత్రమే ఇండియన్స్.

గోవా నుంచి తొలి కార్డినల్‌గా హోదా దక్కించుకున్న ఆర్చ్ బిషప్‌గా ఫెర్రో రికార్డు సృష్టించారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తొలి సారి కార్డినల్ హోదా పొందిన బిషప్‌గా పూల ఆంథోనీ చరిత్ర సృష్టించారు. ఇన్నాళ్లూ పీఠాధిపతులు(బిషప్)గా ఉన్న వీళ్లు ఇకపై కార్డినల్ (మతాధిపతులు)గా వ్యవహరించనున్నారు. వీరితో పాటు ఇండియాలో క్లీమిస్ క్యాథలికోస్ (తిరువునంతపురం), టెలిస్పోర్ టోపో (రాంచీ), ఓస్వాల్డ్ గ్రేసిస్ (ముంబై), జార్జ్ అలెన్‌చెరీ (ఎర్నాకుళం) మాత్రమే ప్రస్తుతం కార్డినల్స్‌గా ఉన్నారు.

పోప్ తర్వాత స్థానంలో కార్డినల్స్ ఉన్నా సరే.. వీళ్లందరూ ప్రస్తుతం ఉన్న ప్రదేశంలోనే తమ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. పూల ఆంథోనీ కూడా హైదరాబాద్ ఆర్చ్ బిషప్‌గా కొనసాగుతూనే.. కాన్డినల్ బాధ్యతలు చేపడతారు. ఈ ఏడాది అగస్టు 27న వాటికన్‌లో జరిగే ఓ కార్యక్రమంలో కొత్త కార్డినల్స్‌కు అభిషేకం చేయనున్నారు.

1961లో పుట్టిన పూల ఆంథోనీ.. 1992లో తొలి సారిగా కడపలో ప్రీస్ట్‌గా అభిషిక్తుడు అయ్యారు. ఆ తర్వాత ఆయనను కర్నూలు చర్చికి ఫాదర్‌గా నియమించారు. 2008లో కర్నూలులోనే ఆర్చ్ బిషప్‌గా నియమించబడ్డారు. 2020 నవంబర్‌లో హైదరాబాద్ ఆర్చ్ బిషప్‌గా తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇక 3 జనవరి 2021లో హైదరాబాద్ ఆర్చ్ బిషప్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది అగస్టు 27న ఆయనను పోప్ ఫ్రాన్సిస్.. కార్డినల్ ప్రీస్ట్‌గా నియమించారు.

First Published:  30 May 2022 1:37 AM GMT
Next Story