Telugu Global
NEWS

తన మైనర్ కొడుకుకు పదేళ్ళ బాలికతో పెళ్ళి చేసిన యూనివర్సిటీ రిజిస్ట్రార్

అతను ఉన్నత చదువులు చదువుకున్నాడు…. ఉన్నత పదవిలో ఉన్నాడు…. కానీ తల నిండా మూఢ విశ్వాసాలే…. దాంతో ఇద్దరు చిన్నారుల‌ జీవితాలను నాశన‍ం చేశాడు. తన 16 ఏళ్ళ కొడుకుకు పదేళ్ళ బాలికతో పెళ్ళి చేశాడు. గుంటూరు జిల్లాకు చెందిన వెంకట రాథేశ్యామ్‌ తిరుపతిలోని ఎస్వీ వేదిక్‌ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా చేస్తున్నాడు. అతను భార్య శ్రీదేవి ఇద్దరు కుమారులతో కలిసి తిరుపతిలోని ఖాదీకాలనీలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. తమ మత, కుటుంబ ఆచారమంటూ తన 16 […]

child marriage
X

అతను ఉన్నత చదువులు చదువుకున్నాడు…. ఉన్నత పదవిలో ఉన్నాడు…. కానీ తల నిండా మూఢ విశ్వాసాలే…. దాంతో ఇద్దరు చిన్నారుల‌ జీవితాలను నాశన‍ం చేశాడు. తన 16 ఏళ్ళ కొడుకుకు పదేళ్ళ బాలికతో పెళ్ళి చేశాడు.

గుంటూరు జిల్లాకు చెందిన వెంకట రాథేశ్యామ్‌ తిరుపతిలోని ఎస్వీ వేదిక్‌ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా చేస్తున్నాడు. అతను భార్య శ్రీదేవి ఇద్దరు కుమారులతో కలిసి తిరుపతిలోని ఖాదీకాలనీలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. తమ మత, కుటుంబ ఆచారమంటూ తన 16 ఏళ్ళ కుమారుడికి
తిరుపతికే చెందిన వెంకటేశ్వర్లు, శ్రావణికుమారి ల పదేళ్ళ కుమార్తె కామేశ్వరితో వివాహం చేశాడు. ఈ నెల 21న సింగాలగుంటలో మఠంలో ఈ పెళ్లి జరిగింది.

ఇది తెలిసిన బాలల హక్కుల కార్యకర్తలు పెళ్ళి ఫోటోలు, ఇతర ఆధారలతో సహా అలిపిరి పోలీసులకు పిర్యాదు చేశారు. దాంతో పెళ్ళైన ఆరు రోజుల ఆలస్యంగా కేసు నమోదు చేశారు పోలీసులు. బాల్య వివాహాల నిషేధ చట్టం 2016 కింద కేసు నమోదైంది. ఈ కేసులో బాలుడి తల్లి‍తండ్రులు వెంకట రాథేశ్యామ్, శ్రీదేవి లతో సహా బాలిక తల్లితండ్రులు వెంకటేశ్వరులు, శ్రావణి కుమారిపై కూడా కేసులు నమోదు చేసినట్లు అలిపిరి సీఐ అబ్బన్న తెలిపారు.

ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని కేసును మరింతగా విచారించి అదనపు ఆధారాలు సేకరిస్తున్నట్లు అలిపిరి సీఐ తెలిపారు. అదే సమయంలో ఎస్వీవీయూ రిజిస్ట్రార్ రాధే శ్యామ్, అతని బంధువులు సీఐ అబ్బన్నతో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. ఇది వివాహం కాదని, తమ‌ కుటుంబంలో పురాతన సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం జరిగే మతపరమైన లాంఛనమని వెంకట రాథేశ్యామ్ వాదిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

First Published:  28 May 2022 12:00 AM GMT
Next Story