Telugu Global
National

దళితుల పెళ్ళి ఊరేగింపుపై అగ్రకులస్తుల దాడి

గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో ఓ దళిత వధువు పెళ్ళి ఊరేగింపుపై అగ్రకుల యువకులు దాడి చేశారు. అహ్మదాబాద్ జిల్లా డెట్రోజ్ తాలూకాలోని దంగర్వా గ్రామంలో ఈ సంఘటన జరిగింది, దంగర్వా గ్రామానికి చెందిన దళితుడైన జగదీష్ పర్మార్ తన కుమార్తె వివాహాన్ని పురస్కరించుకుని గురువారం ఊరేగింపును ఏర్పాటు చేశాడు.డీజే మ్యూజిక్ సిస్టమ్‌లో పాటలు ప్లే చేస్తూ ఊరేగింపు సాగింది. ఊరేగింపు గ్రామంలోని ఓ ప్రదేశానికి చేరుకోగానే ఠాకూర్ (OBC) కులానికి చెందిన కొంతమంది యువకులు ఆ ప్రాంతంలో […]

gujarat
X

గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో ఓ దళిత వధువు పెళ్ళి ఊరేగింపుపై అగ్రకుల యువకులు దాడి చేశారు. అహ్మదాబాద్ జిల్లా డెట్రోజ్ తాలూకాలోని దంగర్వా గ్రామంలో ఈ సంఘటన జరిగింది,

దంగర్వా గ్రామానికి చెందిన దళితుడైన జగదీష్ పర్మార్ తన కుమార్తె వివాహాన్ని పురస్కరించుకుని గురువారం ఊరేగింపును ఏర్పాటు చేశాడు.డీజే మ్యూజిక్ సిస్టమ్‌లో పాటలు ప్లే చేస్తూ ఊరేగింపు సాగింది. ఊరేగింపు గ్రామంలోని ఓ ప్రదేశానికి చేరుకోగానే ఠాకూర్ (OBC) కులానికి చెందిన కొంతమంది యువకులు ఆ ప్రాంతంలో పాటలు ప్లే చేయవద్దని DJ ఆపరేటర్ కు చెప్పారు. అతను నిరాకరించడంతో, ఆరుగురు వ్యక్తులు కర్రలతో ఊరేగింపుపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో వధువు తండ్రి జగదీష్ పర్మార్ తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ సంఘటనకు సంబంధించి ఆరుగురు వ్యక్తులపై గురువారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురిపై ఐపిసి సెక్షన్ 323 (దాడి), 146 (అల్లర్లు) మరియు షెడ్యూల్డ్ కులం మరియు షెడ్యూల్డ్ తెగ (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని డెట్రోజ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ హెచ్‌ఆర్ పటేల్ తెలిపారు.

First Published:  27 May 2022 4:49 AM GMT
Next Story