Telugu Global
National

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ఆ కార్డ్‌ ప్లే చేయబోతోందా?

రాష్ట్రపతి ఎన్నికలపై ఉత్కంఠ మొదలైంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. ఈ ఎన్నికపై ఇప్పటికే ఫోకస్‌ పెట్టిన బీజేపీ.. కొత్త సమీకరణాలకు తెరతీయబోతోంది. 2024 లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా పొలిటికల్‌ సమీకరణాలు ఉండేలా ప్లాన్‌ చేస్తోంది. బీజేపీ అనుకున్న ప్లాన్‌ ప్రకారం పోయినసారి ఎస్సీలకు రాష్ట్రపతి చాన్స్‌ దక్కింది. ఈసారి గిరిజనులకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఇదే జరిగితే దేశానికి తొలి గిరిజన రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకి దక్కుతుంది. ఇటీవల […]

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ఆ కార్డ్‌ ప్లే చేయబోతోందా?
X

రాష్ట్రపతి ఎన్నికలపై ఉత్కంఠ మొదలైంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. ఈ ఎన్నికపై ఇప్పటికే ఫోకస్‌ పెట్టిన బీజేపీ.. కొత్త సమీకరణాలకు తెరతీయబోతోంది. 2024 లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా పొలిటికల్‌ సమీకరణాలు ఉండేలా ప్లాన్‌ చేస్తోంది.

బీజేపీ అనుకున్న ప్లాన్‌ ప్రకారం పోయినసారి ఎస్సీలకు రాష్ట్రపతి చాన్స్‌ దక్కింది. ఈసారి గిరిజనులకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఇదే జరిగితే దేశానికి తొలి గిరిజన రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకి దక్కుతుంది.

ఇటీవల బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. మొత్తం 543సీట్లలో 47 సీట్లు ఎస్టీ కేటగిరీకి రిజర్వ్‌ అయ్యాయి. మరో 62 లోక్‌సభ స్థానాల్లో గిరిజనుల ఓట్లే కీలకం. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో గిరిజన ఓట్లే నిర్ణయాత్మకంగా ఉన్నాయి. ఈ ఏడాది మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఈ సారి గిరిజన ట్రంప్‌ కార్డ్‌ వాడాలని బీజేపీ భావిస్తోంది.

కేంద్రమంత్రులు అర్జున్‌ ముండా, జువల్‌ ఒరన్‌, మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్ముతో పాటు ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ అనుసూయ ఉయి రాష్ట్రపతి రేసులో ఉన్నారు.

ALSO READ: తెలంగాణ అభివృద్దిలో ఎన్ ఆర్ ఐ లు భాగస్వాములు కావాలి -కేటీఆర్

First Published:  21 May 2022 8:46 PM GMT
Next Story